Nag Panchami 2024: శ్రావణమాసం ఆగస్టు 5 వ తేదీ నుంచి ప్రారంభం అయింది. శ్రావణ మాసంలో అనేక పండగలు జరుపుకుంటాము. ఈ మాసం ప్రధానంగా పండగలు, ఉపవాసాలు చేసే మాసంగా పరిగణించడబుతుంది. ఈ మాసానికి మత పరమైన ప్రాముఖ్యత ఎక్కువ. శ్రావణ సోమవారం, మంగళ గౌరి,కృష్ణాష్టమి, రాఖీ పండగతో పాటు మరికొన్ని పండగలను జరుపుకుంటాం. శ్రావణ మాసంలో నాగ పంచమి ప్రధానమైన పండగ. శ్రావణ శుద్ధ పంచమి రోజు శ్రీ కృష్ణుడు కాళీయ నాయుడిని ఓడించి యమునా నది నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ రోజునే నాగ పంచమిగా మనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా నాగ పంచమికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది.
నాగ పంచమి 2024 తేదీ:
శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి పండగను శుక్ల పక్ష పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం ఈ పండను జరుపుకోనున్నారు. ఈ రోజులన సర్ప దేవతను లేదా నాగతదేవతను పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.
నాగ పంచమి పూజా ముహూర్తం:
శ్రావణ మాసంలో శుక్ల పంచమి తిథి 9 ఆగస్టు మధ్యాహ్నం 12: 36 గంటలకు ప్రారంభం అయి 10 ఆగస్టు తెల్లవారు జామున 03: 14 గంటలకు ముగుస్తుంది. ఈ కాలంలో నాగ దేవతలకు పూజలు చేయడం శుభ ప్రదంగా భావిస్తారు.తమకు ఉన్న దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటామని భావిస్తుంటారు.
ముహూర్తం: 05: 47 -08.27
నాగ పంచమి పూజా విధానం:
ఈ రోజున పుట్ట దగ్గరికి వెళ్లి నాగదేవతకు లేదా నాగదేవత పటానికి పూజలు నిర్వహించాలి. గుడి సమాపంలో పుట్ట ఉంటే అక్కడికి వెళ్లి పుట్టలో పాలు పోసి పూజించాలి.పాముకి పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దూర్వ, దహి , గంధ అక్షత, పుష్పాలు కూడా సమర్పించాలి. నాగ పంచమి రోజున ఉపవాసం పాటించి నమోస్తు సర్పేభ్యో యే కే చ పృథ్వీ మను యే అంతరికే యే దివి తేభ్య: సర్పే భ్యో నమ: మంత్రాన్ని పఠించడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది.
నాగ పంచమి ఎందకు జరుపుకుంటారు:
పురాణాల ప్రకారం అభిమన్యు కుమారుడు పరీక్షితుడు పాటు కాటుతోనే మరణించాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా అతని కొడుకు జనమేజయుడు నాగులను చంపడానికి నాగద యజ్ఞం చేశాడు. దానిలో ప్రపంచంలోని అన్ని పాములు కాల్పడం ప్రారంభించాడు. దీంతో పాములు తమ రక్షణ కోసం ఆస్తిక మునులను ప్రారంభించాయి. రుషి జనమేజయ రాజుకు వివరించి ఈ యజ్ఞాన్ని ఆపివేయించాడు. అయితే ఈ ఘటన జరిగిన రోజు శ్రావణ శుక్ల పక్షం పంచమి. ఆ రోజు నుంచే పాములను పూజించడం జరుగుతోంది.
Also Read: సంకటహర చతుర్థి.. ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతిని పూజిస్తే ఐశ్వర్యం మీ సొంతం
నాగ పంచమి పూజా మంత్రం:
అనన్త వాసుకీ శేషం పద్మనాభం చ కంబళమ్
శంఖ పాలన్ ధృతరాష్ట్ర తక్షక్ కాళీయం తత్
ఏతాని నవ్ నామాన్ నగానాన్ చ మహాత్మానమ్