తొమ్మిది గ్రహాలు కాలానుగుణంగా తమ కదలికలు మారుస్తూ రాశులను, నక్షత్రాలను దాటుకుంటూ వెళ్తాయి. ఇలా ప్రతి రాశిలో లేదా ప్రతి నక్షత్రంలో అడుగుపెట్టినప్పుడు కొన్ని రకాల రాజయోగాలు ఏర్పడతాయి. అవి మనుషులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవులపై ఎన్నో ప్రభావాలను చూపిస్తాయి. త్వరలో నవ పంచమ రాజయోగం ఏర్పడబోతోంది. ఇది శుభ యోగం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మూడు రాశుల వారికి విపరీత లాభాలను తెచ్చిపెడుతుంది.
నవ పంచమ రాజయోగం ఆగస్టు ప్రారంభంలో ఏర్పడబోయే శుభ పరిణామం. దీనిలో శని, బుధుడు కలిసి ఈ నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైన ఫలితాలు వస్తాయి. వారికి బంగారు కాలం మొదలవుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.
కర్కాటక రాశి
జ్యోతి శాస్త్రం ప్రకారం నవ పంచమ రాజయోగం కర్కాటక రాశి వారికి విపరీతమైన శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ యోగం వల్ల పెద్ద వ్యక్తులతో అనుబంధాలను పెంచుకుంటారు. అలాగే మీ కెరీర్ సజావుగా ముందుకు సాగుతుంది. అధిక జీతంతో కూడిన కొత్త ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ మతపరమైన కార్యకలాపాలపై మీకు ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా వస్తుంది.
సింహరాశి
నవ పంచమ రాజయోగం ఏర్పాటు వల్ల సింహ రాశి వారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకే ఆదాయ వనరు కాకుండా అనేక ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు ఆర్థికంగా ఈ సమయంలో బలంగా మారుతారు. అలాగే మీలో కూడా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరులకు ఎంతో నచ్చుతాయి. మీరు ఏ పని ప్రారంభించినా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి నవ పంచమరాజు యోగం ఎన్నో ఆనందాలను అందిస్తుంది. వీరికి ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. అలాగే జీతాల పెంపుకు కూడా అంతే ఛాన్స్ లు ఉన్నాయి. మీకు పెద్ద బాధ్యతలు ఉద్యోగంలో అందిస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి మీరు అనేక డబ్బులను పొందుతారు. పూర్వీకుల ఆస్తి కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కారు వంటి ఖరీదైన వాహనాలు కూడా కొనే శుభయోగం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.