Journalist Arrested: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో.. ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి దగ్గరే కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ట్రానిస్ట్ వారెంట్ ఇచ్చి కొమ్మినేనిని ఏపీకి తీసుకెళ్తున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్ లో కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు.రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో కేసు నమోదైంది. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుతోనే జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైనా కేసు పెట్టారపు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాక్షి ఛానల్ లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేశారు కృష్ణంరాజు…అమరావతి వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలను ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చ కొనసాగించారు.
సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతిపై.. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అంటూ.. ఆయన చేసిన కామెంట్స్‌పై.. రాజధాని ప్రాంత మహిళలు, రైతులు భగ్గుమన్నారు. ఇది యావత్ రాజధాని ప్రాంత వాసులు అవమానపరచమేడనని మండిపడ్డారు. శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. జర్నలిస్ట్‌పై కేసులు నమోదు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. శ్రీనివాసరావు వ్యాఖ్యలకు నిరసనగా.. ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతూ మహిళలు ఆందోళన చేపట్టారు.
అమరావతి రాజధానిపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అనేక విజయం సంఘాలు సైతం అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది మమ్మాటికి రాజధానిపై కుట్రేనని అందులో భాగంగానే.. ఇలాంటి తప్పుడు ప్రచారంతో.. అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అమరావతి జేఏసీ సైతం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే.. తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని వారు ఆరోపించారు.
రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై.. కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని గురించి.. ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన సొంత మీడియా ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఖండించక పోవడం విచారకరమని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలు గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: వేశ్యల రాజధాని వ్యాఖ్యల వెనుక భారతి రెడ్డి హస్తం ఉందా!! అనిత సంచలన కామెంట్స్
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగంగానే మాట్లాడారని పవన్ అన్నారు. జర్నలిస్ట్ ముసుగులో నీచంగా మాట్లాడారని.. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32శాతం ఎస్సీ, ఎస్టీ, 14శాతం బీసీ రైతులున్నారని పవన్ తెలిపారు. రాజధానిపై కుట్రలకు పాల్పడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని పవన్ అన్నారు.