E-Paper
Advertisement

Bael and Tulsi leaves: మారేడు, తులసి దళాలు విషయంలో ఆ తప్పులు అసలు చేయకండి.. లేదంటే సకల దరిద్రాలు మీ వెనకాలే ఉంటాయట

Bael and Tulsi leaves: మారేడు, తులసి దళాలు విషయంలో ఆ తప్పులు అసలు చేయకండి.. లేదంటే సకల దరిద్రాలు మీ వెనకాలే ఉంటాయట
Advertisement

Bael and Tulsi leaves: పూజా సమయంలో మారేడు, తులసి దళాల విషయంలో ఆ తప్పులు అసలు చేయద్దంటున్నారు పండితులు. చాలా మంది తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం రాదంటున్నారు. అయితే మారేడు, తులసి దళాల విషయంలో అందరూ చేసే తప్పులేంటి..? వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారేడు, తులసి దళాలు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనవి. వీటిని కోసేటప్పుడు మరియు ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయని పండితులు సూచిస్తున్నారు ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తులసి దళాలు (Tulsi Leaves) ఎప్పుడు కోయకూడదు?: శాస్త్రాల ప్రకారం ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ద్వాదశి తిథి, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి సమయాల్లో మరియు సూర్యాస్తమయం తర్వాత తులసిని కోయకూడదు. అలాగే స్నానం చేయకుండా తులసిని తాకడం కానీ, కోయడం కానీ చేయకూడదట.

తులసిని ఏఏ దేవుళ్లకు వాడకూడదు: తులసిని గణపతి పూజలో ఉపయోగించరాదట. దానికి ఒక బలమైన కథనమే ఉందంటున్నారు పండితులు. పురాణాల ప్రకారం ఒకసారి తులసి గణేశుడిని వివాహం చేసుకోమని కోరగా, ఆయన తిరస్కరిస్తారట. ఆ సందర్భంలో జరిగిన పరస్పర శాపాల వల్ల వినాయక పూజలో తులసిని వాడకూడదట. శివపూజలోనూ తులసిని వాడకూడదట. తులసి (బృంద) భర్త అయిన జలంధరుడిని శివుడు సంహరించిన కారణంగా, శివపూజలో తులసి దళాలను ఉపయోగించరట.

Advertisement

మారేడు దళాలు (Bilva Leaves) ఎప్పుడు కోయకూడదు?: మారేడు దళాలు చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథులలో మరియు సోమవారం రోజున మారేడు దళాలను కోయకూడదని శాస్త్రం చెబుతుందట. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం కాబట్టి, ఆ రోజున చెట్టును ఇబ్బంది పెట్టకూడదని అంటారు. పూజ కోసం కావాలంటే ఒక రోజు ముందే కోసి ఉంచుకోవచ్చట (మారేడు దళాలు పాతవైనా పవిత్రత కోల్పోవు).

మారేడు ఏఏ దేవుడికి వాడకూడదు?: మారేడు దళాలను సూర్య భగవానుడి పూజలో వాడకూడదట.  సాధారణంగా సూర్యారాధనలో మారేడు దళాలను ఉపయోగించే ఆచారం లేదట. మారేడు దళాలు ప్రధానంగా శివుడికి మరియు లక్ష్మీదేవికి (శ్రీ సూక్త విధానంలో) అత్యంత ఇష్టం. ఇతర దేవతల పూజలో వీటిని తక్కువగా ఉపయోగిస్తారట.

ముఖ్యమైన కారణాలు: ఈ మొక్కలు కేవలం ధార్మికంగానే కాకుండా ఔషధపరంగా కూడా గొప్పవి. ఇష్టానుసారంగా కోయడం వల్ల వాటి శక్తి క్షీణించకూడదనే ఉద్దేశంతో ఈ నియమాలు పెట్టి ఉండొచ్చని పండితులు సూచిస్తున్నారు. అలాగే పురాణాల ప్రకారం ఈ మొక్కలలో దేవతలు కొలువై ఉంటారట. నిర్దిష్ట సమయాల్లో వాటిని కోయకపోవడం అనేది ప్రకృతి పట్ల మనం చూపే గౌరవంగా బావించాలట. తులసి మరియు మారేడు దళాలు ఒక్కసారి కోసిన తర్వాత చాలా రోజుల వరకు పూజకు అర్హత కలిగి ఉంటాయట (వాడిపోయినా పర్వాలేదు). కాబట్టి ప్రతిరోజూ కోయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతోందట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పూజ కోసం కావాల్సి వస్తే, ఆ వృక్షానికి నమస్కరించి, అనుమతి అడిగి కోయడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మీ మొబైల్ నెంబర్ లో 9వ స్థానంలో ఆ రెండు సంఖ్యలు ఉంటే దరిద్రమట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×