Akhil Akkineni: మామూలుగా వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలు కొంచెం కూడా అందుకోలేకపోయినా వారి కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్లు తప్పవు. అలా దీనికి ఉదాహరణగా చెప్పడానికి చాలామంది వారసులే ఉన్నారు. చాలా తక్కువమంది మాత్రమే ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ కేటగిరిలో చేరడానికి అయ్యగారు కూడా కష్టపడుతున్నారు. అయ్యగారు అంటే మరెవరో కాదు.. అఖిల్ అక్కినేని (Akhil Akkineni). కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అఖిల్.. ఫైనల్‌గా షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాడు.
ప్రేమలో పడ్డారు
అక్కినేని ఫ్యామిలీ హీరోల ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా హాట్ టాపిక్ నడుస్తుంటుంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. ఈ ముగ్గురు ముందుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వారితో విడిపోయి ఇప్పుడు మరొకరితో కలిసుంటున్నారు. అఖిల్ విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా ఒక అమ్మాయితో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. కానీ ఏమైందో తెలియదు.. కొన్నాళ్లకే ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిపోయింది. ఇటీవల జైనాబ్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్ననంటూ తన రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టాడు అఖిల్. అదే ఉత్సాహంలో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. దీంతో ఫైనల్‌గా తనను వెండితెరపై చూడొచ్చని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
Also Read: ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఉంది.. కోరికను బయటపెట్టిన ఉపేంద్ర
టైటిల్ అదేనట
అఖిల్ హీరోగా ఇప్పటివరకు 5 సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా మినిమమ్ హిట్ అవ్వలేదు. దీంతో తన కమ్ బ్యాక్ చాలా గట్టిగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు ఈ అక్కినేని వారసుడు. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మానేశాడు. గడ్డం పెంచేశాడు. లుక్స్ మార్చేశాడు. ఫైనల్‌గా సైలెంట్‌గా తన 6వ సినిమా కూడా ప్రారంభించాడు. మురళి కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినా కూడా అప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కూడా ప్రారంభం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అందరూ ఫిక్స్
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మురళి కృష్ణ అబ్బూరు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే అఖిల్ నటిస్తున్నాడంటే అలాంటి ఒక అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ సినిమానే వస్తుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మొత్తానికి ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న తర్వాత అఖిల్ బయటికి వచ్చి సినిమా చేయడం మంచి విషయమే అని, కానీ ఈ సినిమాతో అయినా హిట్ కొడితే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కూడా పూర్తిగా ఫ్లాప్ ట్రాక్‌లోనే ఉన్నా కూడా తనకు ‘తండేల్’ హిట్ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.