Akshaya Tritiya : అక్షయ తృతీయ అనగానే అందరూ బంగారం కొనేస్తుంటారు. డబ్బులు లేని వాళ్లైతే కనీసం వెండి అయినా కొందామని మార్కెట్లకు వెళ్తుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనడం కన్నా ఒక్క వస్తువు కొని దానం చేస్తే అఖండ ధనప్రాప్తి కలుగుతుందట. ఇంకా ఎన్నో విధాలుగా మంచి జరుగుతుందట. ఇంతకీ ఆ వస్తువు ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.
అక్షయ తృతీయ అనగానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అందరూ నగల షాపుల్లోనే కనిపిస్తుంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఆ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటామన్న ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే అక్షయ తృతీయ రోజున ప్రత్యేక ఆచారాలతో లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని హిందువుల నమ్మకం. అందుకే బంగారమే కాదు మరేదైనా వెండి కానీ కొత్త వస్తువులు కానీ ఇల్లు కానీ కొనడానికి అక్షయ తృతీయ రోజు చాలా ప్రత్యేకమైనదిగా బావిస్తారు. కానీ ఎక్కువ మంది మాత్రం అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనడానికే ప్రాధాన్యత ఇస్తారు.
అయితే అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొనడం ఒక ఎత్తయితే చాలా మందికి తెలియని విషయం మరోకటి ఉంది. అదే అక్షయ తృతీయ రోజు పుత్తడి లేదా ఇత్తడి మాత్రమే కాదు ఉప్పు కొనడం కూడా చాలా శుభప్రదం అని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ నాడు ఉప్పు కొనడం మాత్రమే కాదు ఆ కొన్న ఉప్పును ఎవరికైనా దానంగా ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఆచారం అనేది అనాది కాలం నుంచే ఉందని.. మనుషులు తమ సంపదను పెంచుకోవడానికి.. తంత్రశాస్త్రంలో ఇదొక పరిహారంగా ఉందని పండితులు చెప్తున్నారు. అయితే ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని… అప్పటి వరకు పట్టి పీడిస్తున్న సకల దోషాలు నివారణ అవడంతో మనుషులు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇక అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయట.
అక్షయ తృతీయ రోజున ఎలాంటి ఉప్పు కొనాలి:
అయితే ఉప్పు కొని దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది కదా అని ఏద పడితే అది కొనకూడదని పండితులు చెప్తున్నారు. సముద్రపు రాతి ఉప్పునే కొనాలట. ఆలా కొని దానం ఇస్తేనే మంచి జరుగుతుందట. ఇక అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రంగా బావిస్తారు. ఇలా రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందట. ఇంకా రాతి ఉప్పు కొని ఇంటికి తీసుకురావడంతో ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయని నమ్ముతారు. అలాగే ఉప్పును ఒక గాజు సీసాలో వేసి బాత్రూంలో ఉంచినట్లయితే కూడా ఆ ఇంటికి ఉన్న సమస్త వాస్తు దోషాలు నివారణ అవుతాయని పండితులు చెప్తున్నారు. అంతే కాదు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటలో కూడా ఉపయోగించవచ్చని చెప్తున్నారు.
రాతి ఉప్పు భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి, మానసిక ప్రశాంతతకు కారణమైన చంద్రుడికి సంబంధించినదని నమ్ముతారు. కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల అనేక సమస్యలు దూరం అవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుందట.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు