HIT 3: నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ Hit 3. ఈ చిత్రం హిట్ సీక్వెల్స్ లో మూడవది. ప్రశాంతి తిపిర్నేని సినిమాను నిర్మిస్తున్నారు. నాని సొంత బ్యానర్ పోస్టర్ సినిమా, యునానిమల్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. నాని ఇప్పటివరకు చేయని పోలీస్ పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. మే 1న సినిమా థియేటర్లో సందడి చేయనుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు. అందులో భాగంగా చీఫ్ గెస్ట్ గా ప్రముఖ దర్శకుడు రానున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
ప్రీ రిలీజ్ కు రానున్న డైరెక్టర్ ..
హిట్ సినిమా సీక్వెల్స్ మొదటి రెండు భాగాలుగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు రానున్న హిట్ 3 సీక్వెల్ ఫై హైప్ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో చూసిన బీభత్సం వెండితెరపై ఎప్పుడు చూస్తామని నాని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల చివరి వారంలో చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా దర్శక ధీరుడు, తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళిని రానున్నట్లు సమాచారం. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలను రాజమౌళి ప్రోత్సహిస్తూ ఉంటారు. అందులో భాగంగా నానితో రాజమౌళికి ఈగ సినిమా నుండి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళిని తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పుడు ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, నాని ఒకే వేదికపై కలవనున్నారు అనే సమాచారంతో, నాని కోసం రాజమౌళి ఈవెంట్ కు రావడం అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమా సక్సెస్ లో ఒక భాగం కానుంది.
అర్జున్ సర్కార్ గా హీరో ..
ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ గా విజృంభణ చేయనున్నాడు. విశాఖపట్నంలో జరిగే ఒక క్రైమ్ స్టోరీ ఇన్వెస్టిగేషన్ లో నాని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. క్రైమ్ ఎలా జరిగింది అనే కోణంపై ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మే 1న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రెండు గంటల 30 నిమిషాల రన్ టైం తో మన ముందుకు రానుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
Telugu Movies : ఒక్క రోజే 12 సినిమాలు విడుదల.. ఓసారి లుక్కేయండి