Numerology: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతే తట్టుకోలేరట. ఇంకా చెప్పాలంటే ఆ తేదీలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రేమలో మోసపోతుంటారట. అయితే ప్రేమలో మోసపోయే జాతకులు ఎవరు..? అలాగే మిగతా తేదీలలో పుట్టిన వారు తమకు జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యలకు తట్టుకోలేరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకటో నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారిని ఒకటో నెంబర్ వ్యక్తులు అంటారు. ఈ సంఖ్యలో పుట్టిన వారు ఎక్కువగా నాయకులుగా రాణిస్తారు. అయితే వీరు ఒకరి కింద పని చేయడం అంటే ఇష్టపడరు. అలా చేయడాన్ని వీళ్లు బానిసలుగా బావించి తట్టుకోలేరట.
రెండవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వారిని రెండవ నెంబర్ వ్యక్తులు అంటారు. వీరు ఎక్కువగా ప్రేమలో మోసపోతారట. అయితే ప్రేమలో మోసపోవడం కూడా వీరు తట్టుకోలేరట. దేవదాసు లాగా మారిపోయేవాళ్లు అల్మోస్ట్ రెండవ నెంబర్ వ్యక్తులే అయ్యుంటారు.
మూడవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముఫ్పై తేదీలో పుట్టిన వారు మూడవ నెంబర్ జాతకులు అవుతారు. వీరు చాలా కఠినంగా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా వినరు. వీరి మాటే శాసనం అనే విధంగా ప్రవర్తిస్తారు.
నాలుగవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముఫ్పై ఒకటి తేదీలలో పుట్టిన వారు నాలుగవ నెంబర్ వ్యక్తులు అవుతారు. వీరికి స్నేహం చేయడం అంటే చాలా ఇష్టం కానీ దురదృష్టం ఏంటంటే వీరు ఎక్కువగా స్నేహితల చేతుల్లోనే మోసపోతుంటారు. అలా మోస పోవడం వీరు సహించలేరు.
అయిదవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలలో అయినా ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన వారు అయిదవ నెంబర్ వ్యక్తులు అవుతారు. వీరు రెండు రకాలుగా మాట్టాడే వారిని చూస్తే తట్టుకోలేరు. దీనినే రెండు నాలుకల ధోరణి అంటారు.
ఆరవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా ఆరు, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వారిని ఆరవ నెంబర్ వ్యక్తులు అంటారు. వీరు పైకి కపట ప్రేమను నటించే వారిని వెంటనే పసిగట్టి దూరం ఉంటారు. మోస పోవటాన్ని వీరు అస్సలు సహించలేరు.
ఏడవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా ఏడు, పదహారు, ఇరవై అయిదు తేదీలలో పుట్టిన వారు ఏడవ నెంబర్ జాతకులు అవుతారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరు దేవుణ్ని బాగా ఆరాధిస్తారు. వీరు ఎప్పుడైనా దేవుడికి దూరంగా ఉండాల్సి వస్తే అసలు తట్టుకోలేరట. వీరు ఆధ్యాత్మిక రంగంలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారట.
ఎనిమిదవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వారిని ఎనిమిదవ నెంబర్ వ్యక్తులు అంటారు. వీరు కొద్దిగా నెమ్మదిగా ఉంటారు. కానీ ఎవరైనా పనిలో నిర్లక్ష్యం వహించినా..? అసహనానికి కారణం అయినా వారిని అస్సలు సహించరు.
తొమ్మిదవ నెంబర్ వ్యక్తులు: ఏ నెలలో అయినా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారిని తొమ్మిదో నెంబర్ జాతకులు అంటారు. న్యూమరాలజీ ప్రకారం వీరి ముందు ఎవరైనా తామే గొప్ప అన్నట్టు ప్రవర్తిస్తే అసలు సహించరట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది వీరి లక్షణం.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు హిందూ పండితులు మరియు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్