Indian Railways: భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. కత్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. రేపటి నుంచి ఈ రైలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ వందేభారత్ రైలు ఇతర రైళ్లతో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. జమ్మూకాశ్మీర్ లోని తీవ్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ప్రపంచంలోనే ఎత్తైన ఐకానిక్ చీనాబ్ వంతెన మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఇవాళ ప్రారంభమైన రెండు వందే భారత్ రైళ్లు కత్రా-శ్రీనగర్ మార్గంలో నడుస్తాయి.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు టూర్ ప్లాన్ చేస్తున్నారా?
మీరు కూడా ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే, ఇబ్బందిలేని ప్రయాణం కోసం ఏ రైలును సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు వెళ్లాలనుకుంటే, వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో సహా ఏ రైళ్లు మిమ్మల్ని నేరుగా కనెక్ట్ చేస్తాయో చూద్దాం..
ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు రైలులో ఎలా ప్రయాణించాలి?
ఢిల్లీ నుంచి శ్రీ నగర్‌కు నేరుగా రైల్వే కనెక్షన్ లేనప్పటికీ, సమీప ప్రధాన రైల్వే స్టేషన్ అయిన జమ్మూ తావికి రైలులో సులభంగా వెళ్లవచ్చు. తావి నుంచి శ్రీనగర్ దాదాపు 270 కి.మీ దూరంలో ఉంది. ఢిల్లీ నుంచి కత్రా-శ్రీనగర్‌కు మిమ్మల్ని కనెక్ట్ చేసే పలు రైళ్లు ఉన్నాయి.
⦿ శ్రీ శక్తి ఎక్స్ ప్రెస్: ఈ రైలు ఢిల్లీ నుంచి సాయంత్రం 7.05 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు చేరుకుంటుంది. కత్రా నుండి ఉదయం 8:10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ద్వారా శ్రీనగర్ కు వెళ్లవచ్చు.
⦿ ఉత్తమ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్: ఈ రైలు ఢిల్లీ నుంచి రాత్రి 8.50 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 7.55 గంటలకు కత్రాకు చేరుకుంటుంది. ఉదయం 8:10కి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కత్రా నుంచి శ్రీనగర్ కు వెళ్లవచ్చు.
⦿ జమ్మూ మెయిల్: ఈ రైలు రాత్రి 9.30కి ఢిల్లీ నుంచి బయల్దేరుతుంది. ఉదయం 9.15కు కత్రాకు చేరుకుంటుంది. మధ్యాహ్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో శ్రీనగర్ కు బయల్దేరవచ్చు.
⦿ హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్: ఈ రైలు రాత్రి 9:30 ఢిల్లీ నుంచి బయల్దేరుతుంది. ఉదయం 10.45కు కత్రాకు చేరుకుంటుంది. మధ్యాహ్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా శ్రీనగర్ కు వెళ్లవచ్చు.
⦿ కత్రా వీక్లీ ఎక్స్‌ప్రెస్: ఈ రైలు ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30కి కత్రాకు చేరుకుంటుంది. మధ్యాహ్నం వందేభారత్ ద్వారా శ్రీనగర్ కు వెళ్లవచ్చు.
⦿ జీలం ఎక్స్‌ప్రెస్: ఈ రైలు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉదయం 9.45కు కత్రాకు చేరకుంటుంది. మధ్యాహ్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు శ్రీనగర్ వెళ్లవచ్చు
⦿ గల్తా ధామ్ పూజ ఎక్స్‌ప్రెస్: ఈ రైలు ఉదయం 7.30కి కత్రాకు చేరకుంటుంది. ఉదయం 8:10 గంటల వందేభారత్ రైల్లో శ్రీనగర్ కు వెళ్లవచ్చు.
ఈ రైళ్లు కత్రా నుంచి శ్రీనగర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సులభంగా కనెక్ట్ అవ్వడానికి సాయపడుతాయి.ఇది మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది.
Read Also: తొలి కాశ్మీర్ కు రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జికి మోడీ పచ్చ జెండా!
కత్రా నుంచి శ్రీనగర్‌కు ప్రయాణ సమయం ఎంత?
కత్రా నుంచి శ్రీనగర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం రోజుకు రెండు సర్వీసులతో నడుస్తుంది. మొదటి రైలు కత్రా నుంచి ఉదయం 8:10 గంటలకు బయలుదేరి శ్రీనగర్‌కు ఉదయం 11:08 గంటలకు చేరుకుంటుంది. మంగళవారం తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది. రెండవ సర్వీస్ కత్రా నుంచి మధ్యాహ్నం 2:55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:53 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఛార్జీ విషయానికొస్తే, ఉదయం వందే భారత్ సర్వీస్‌కు చైర్ కార్ ఛార్జీ ₹715గా నిర్ణయించగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీ ₹1320గా నిర్ణయించబడింది. మధ్యాహ్నం రైలుకు, చైర్ కార్ ఛార్జీ ₹880 ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీ ₹1515గా ఫిక్స్ చేశారు.
Read Also: కాశ్మీర్ వందేభారత్ ప్రారంభం, దీని ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!