E-Paper
Advertisement

Mercury Retrograde: బుధుడి తిరోగమనం.. ఈ 3 రాశుల వారికి పనుల్లో ఆటంకాలు

Mercury Retrograde: బుధుడి తిరోగమనం.. ఈ  3 రాశుల వారికి పనుల్లో ఆటంకాలు

Mercury Retrograde Effects: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంతో పాటు తిరోగమన కదలిక రాశుల మనసుపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు ఆగస్టు నెలలో తిరోగమన దిశలో సంచరించబోతున్నాడు. ఇది మేషం నుంచి మీనం వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తుంది.

కర్కాటక రాశిలో ప్రస్తుతం బుధుడు ఉన్నాడు. జూలై 19న బుధుడు, సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఆగస్టు 5వ తేదీన సింహ రాశిలోకి తిరోగమనంలో సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బుధుడి తిరోగమనం వల్ల అధిక ప్రయోజనాలు లభిస్తాయి. కానీ మరికొంత మందికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో రోజు కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు తిరోగమనం కదలిక ఏ రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి:
సింహరాశిలో బుధుడి తిరోగమన సంచారం జరగబోతుంది. ఫలితంగా ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం చాలా వరకు తగ్గించుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం మంచిది. మీరు కుటుంబ జీవితంలో సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఇంట్లో ఘర్షణతో కూడిన వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి. కోర్టు కేసుల కోసం డబ్బు బాగా ఖర్చు అవుతుంది.

వృశ్చిక రాశి:

బుధుడి తిరోగమనం వల్ల వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ సమయంలో ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సంబంధాలలో సహనం పాటించండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సంబంధాలలో సహనం పాటించండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో ఆందోళన కలుగుతాయి. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి.

Also Read: ఈ రాశుల వారికి త్వరలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు..

మకర రాశి:
బుధ గ్రహ తిరోగమనం మకరరాశి వారి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ ఏకాగ్రత బాగా లోపిస్తుంది. పనిలో కూడా ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. తెలియని భయం వల్ల మనసు చికాకుగా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. పని కోసం దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి. డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ చేయకండి. లేకుంటే నష్టం జరుగుతుంది. ఆస్తి విషయంలో బంధువులు లేదా స్నేహితులతో వివాదాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×