Lucky Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెలలో చాలా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. శని, సూర్యుడు, బృహస్పతి, శుక్ర గ్రహాలు ఈ నెలలో రాశులు మార్చుకోనున్నారు. శని రాశి మార్పు ఈ నెలలో చాలా ప్రముఖమైందిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు.
అదే సమయంలో, సూర్యుడు, బుధుడు, శుక్రుడు కూడా రాశి మార్చుకోనున్నారు. ఈ గ్రహాల సంచారము వల్ల అక్టోబర్ నెలలో 4 వేర్వేరు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రాజయోగం అక్టోబర్ నెలలో 3 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది.
అక్టోబరు నెలలో కుంభరాశిలో శని తిరోగమనం శష రాజయోగాన్ని ఏర్పరచనుంది. అంతే కాకుండా ధనం, వ్యాపారం, వాక్కును ఇచ్చే బుధుడు భద్ర రాజయోగాన్ని, శుక్రుడు మాళవ్య రాజయోగాన్ని, లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని సృష్టించనున్నాడు. ఈ 4 రాజయోగాలు కలిసి ఏర్పడటం వల్ల 3 రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: అక్టోబర్ నెల ఈ వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు వృత్తి, వ్యాపారాలలో ఊహించిన దాని కంటే ఎక్కువ విజయాలను పొందుతారు. ఆకస్మిక ఆర్థిక లాభానికి బలమైన అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఎంతో కాలంగా పెండిలో ఉన్న మీ పనులు పూర్తవుతాయి. మీ కుటుంబ సభ్యలు నుంచి మీకు మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. దూర ప్రాంతాలకు వెళ్ల వలసి స్తుంది. మీ శత్రువుల వల్ల కొంత మనశ్శాంతి కరువవుతుంది. మీరు తలపెట్టిన పనులు విజయవంతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యలుతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు.
సింహ రాశి: ఈ రాశి వారికి అక్టోబర్ నెల సానుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇతర ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. అంతే కాకుండా మీ ఆదాయం పెరుగుతుంది.మీ ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కెరీర్ పరంగా విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
Also Read: త్రిగ్రాహి యోగంలో ఈ 3 రాశుల వారు డబ్బు పొందబోతున్నారు
తులా రాశి : అక్టోబర్ నెల తులారాశి వారికి విపరీతమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీ రాశిలోనే మాళవ్య రాజ్యయోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీరు చాలా శుభవార్తలు పొందుతారు. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందవచ్చు. ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్ నెల మీకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. మీ ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతే కాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)