BigTV English

Ysrcp Seats : చట్టసభల్లో వైసీపీ బలమెంత… ఇప్పటికీ జగన్‌దే పైచేయా?

Ysrcp Seats : చట్టసభల్లో వైసీపీ బలమెంత… ఇప్పటికీ జగన్‌దే పైచేయా?

నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోగానే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో, మండలిలో, ఇటు లోక్ సభ, రాజ్యసభలో కావాల్సినంత బలం ఉండేది. వాటితో ఎవరిపై ఆధారపడకుండానే సొంతంగానే చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉండేది.


ఒకవైపు రాష్ట్రంలో శాసనసభ రూపొందించే చట్టాల్లో ఆ పార్టీదే ముఖ్యపాత్ర ఉండేది. మరోవైపు పార్లమెంటులోనూ వైసీపీది చెప్పుకునే స్థాయి పాత్రే. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. వైఎస్ జగన్ పార్టీ ప్రాధాన్యం లేకుండానే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో బిల్లులు పాస్ కానున్నాయి.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక శాసనమండలిలో మొత్తం 58 సీట్లకుగాను 8 మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి జగన్ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలున్నారు. ఇందులోనే టీడీపీకి 8 మంది, నలుగురు ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ నుంచి ఇద్దరు సభ్యులుండగా మరో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా జనసేన ఇంకా ఖాతా తెరవలేదు.


టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి 175 స్థానాలకు గానూ ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. 

తెలుగుదేశం – 135 సీట్లు,

జనసేన – 21 స్థానాలు,

బీజేపీ – 8.

ఇక అసెంబ్లీలో సూపర్ విక్టరీ కొట్టిన కూటమి, రాష్ట్రంలోని రాజ్యసభ స్థానాలన్నీ ఆ కూటమి దక్కించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ కూటమి పార్టీ జయభేరి మోగించింది. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 సీట్లు కలిపి మొత్తంగా 21 సీట్లు గెలుచుకున్నాయి. ఇక జనసేన పార్టీ ప్రారంభిన పదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పార్టీ రాజ్యసభలోనూ అడుగుపెట్టనుంది. ఇప్పటికే లోక్ సభలోనూ జనసేనాని ప్రవేశించింది. 

వైసీపీ తాజా బలాబలాలు ఇవే :

అసెంబ్లీ – 11

మండలి – 38

లోక్ సభ – 4

రాజ్యసభ – 8

కేంద్ర రాష్ట్రాల చట్టసభల్లో ప్రస్తుతానికి వైసీపీకి ఉన్న సీట్లు, స్థానాలు చాలా తక్కువ. వీటితో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క శాసనమండలిలో మినహా మరెక్కడా ప్రభావం చూపించలేని దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది.

Also read : చేయరాని నేరాలు చేశారు.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు : చంద్రబాబు

రాష్ట్రంలో ఎప్పుడైనా అధికార పార్టీది లేదా కూటమిదే హవా నడుస్తుంటుంది. ఈ లెక్కన ఏపీ శాసనమండలిలో అధిక బలం కలిగిన వైసీపీని ప్రస్తుత అధికార కూటమి త్వరలోనే బీట్ కొట్టే అవకాశాలున్నాయట. ఇప్పటికే అసెంబ్లీలో భారీ మెజారిటీ సాధించిన కూటమి, వాటితో మండలిలోనూ తమ స్థానాలను మెరుగుపర్చునే దిశలో పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు ఏపీ రాజకీయాలను శాసించిన వైసీపీ, ఇప్పుడు అన్ని స్థాయిల చట్టసభల్లో తమ ప్రాభవాన్ని కోల్పోవడం గమనార్హం.

Related News

MP Avinashreddy: అవినాష్‌రెడ్డికి గడ్కరీ సర్‌ ప్రైజ్.. ఆ పార్టీల మధ్య ఏం జరుగుతోంది?

iPhone Unit: కుప్పం ప్రాంతానికి మహార్థశ.. ఐఫోన్ ఛాసిస్ తయారీ, ముందుకొచ్చిన ఆ కంపెనీ

AP Politics: సినిమాలకు గుడ్ భై..! పవన్ ప్లాన్ ఇదేనా..?

Heavy Rains: రాష్ట్రంలో కుమ్మేస్తున్న వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

AP rainfall alert: ఏపీలో మళ్లీ వానల దాడి.. తీర ప్రాంతాలకి అలర్ట్!

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

Big Stories

×