Minister Komatireddy: అమెరికాలో చదువుకున్నావు.. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శివాలెత్తారు. అంతటితో ఆగక.. మూసీ మీద చర్చకు నీ అయ్యను రమ్మను కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు మంత్రి. దీనితో మూసీ ప్రక్షాళన వేదికగా.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి.
హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. మూసీ సుందరీకరణకై ప్రక్షాళన చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కి.మీ పరిధిలో మొత్తం 40 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు. తాజాగా వాటి కూల్చివేతలను సైతం ప్రారంభించారు అధికారులు. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో గల ఆక్రమణదారులు మాత్రం నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం వారికి డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేస్తున్న చర్యల పట్ల బీఆర్ఎస్ ముందు నుండి విమర్శలు గుప్పిస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం ఘాటుగానే బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అంతేగాక డైరెక్ట్ గా మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సైతం విమర్శలు ఎక్కుపెట్టారు.
అమెరికాలో చదవుకున్నావ్ కేటీఆర్ అసలు నీకు కమాన్ సెన్స్ ఉందా : మంత్రి కొమటిరెడ్డి
మానవత్వం ఉన్న ప్రతి మనిషి మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారు.
బీఆర్ఎస్ పార్టీకి మానవత్వం లేదు.
కేసీఆర్, కేటీఆర్ లు మా నల్గొండకు వస్తే మూసీ బాధితులను చూపిస్తా.
పోరాటాల గడ్డ మా నల్గొండ జిల్లాపై… pic.twitter.com/gVrepwEFk4
— BIG TV Breaking News (@bigtvtelugu) October 1, 2024
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను మూసీ ప్రక్షాళన కోసం 11 రోజులు దీక్ష చేసినట్లు, మానవత్వం ఉన్న ప్రతి మనిషి మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారన్నారు. ఇక్కడి ఆక్రమణలు తొలగించేందుకు ప్రజలను ఒప్పిస్తామని, అలాగే ప్రభుత్వం తగిన రీతిలో సాయం చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మానవత్వం లేదని, అందులో కేసీఆర్, కేటీఆర్ లకు అస్సలు లేదన్నారు. అమెరికాలో చదవుకున్నావ్.. కేటీఆర్ అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
Also Read: Singireddy Niranjan Reddy: చెరువును మింగేసిన నిరంజన్ రెడ్డి.. నీళ్లు కనబడలేదా మహాశయా!
పోరాటాల గడ్డ మా నల్గొండ జిల్లాపై ఎందుకింత కక్ష్య కేటీఆర్ ? అంటూ ప్రశ్నించి.. మా నల్గొండకు వస్తే మూసీ బాధితులను చూపిస్తా అంటూ ఆగ్రహించారు. దమ్ముంటే మూసీ మీద చర్చకు నీ అయ్యను రమ్మను కేటీఆర్ అంటూ మరింత ఘాటుగా విమర్శించారు. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన సాగిస్తుంటే.. మరో వైపు ఓర్వలేని బీఆర్ఎస్ ప్రజలను పలు విధాలుగా రెచ్చగొడుతుందన్నారు. అయితే ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేదని, ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు తాము పాటుపడుతుంటే.. అభివృద్దిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు.