BigTV English

Donald Trump tariffs: ట్రంప్ వాతలు భారత్ కు ఎంత టాక్స్ అంటే.?

Donald Trump tariffs: ట్రంప్ వాతలు భారత్ కు ఎంత టాక్స్ అంటే.?

Donald Trump tariffs: తాజాగా ట్రంప్ టారిఫ్ టార్చర్‌ మరోస్థాయికి చేరుకుంది. లిబరేషన్ డే అనే పేరుతో సుంకాలు రెడీ చేసిన ట్రంప్… టారిఫ్ వార్‌ని పూర్తి స్థాయిలో మొదలుపెట్టారు. ప్రపంచంలో 195 దేశాలుంటే.. అందులో 180కి పైగా దేశాలకు ట్రంప్ వాతలు పెట్టారు. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా అందరికీ వడ్డించేసేరు. “ఇంతటితో ఆగుతానని అనుకుంటున్నారా..? అప్పుడే అయిపోలేదు.. ముందుంది మొసళ్ల పండుగ!” అని కూడా అంటున్నారు. ఇంతకీ, ప్రపంచంపై ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది…? ట్రంప్ దెబ్బకు ఇండియాపై పడే ప్రభావం ఎంత…? అమెరికాకు ప్రధాన ట్రేడ్ పార్టనర్స్ అయిన కెనడా, యూరప్‌ దేశాల పరిస్థితి ఏంటీ…? మిగిలిన దేశాలు ఏం చేయబోతున్నాయి..? ఇంత చేస్తున్న అమెరికాపై ఆధారపడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?


కొత్త సుంకాలతో లార్జ్ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్

అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్… ఫాస్ట్ ఫాస్ట్‌గా అడుగులేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉలిక్కిపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా, అక్రమ వలసదారుల పేరుతో వేలమందిని తరిమేసిన ట్రంప్… ఆ తర్వాత, అమెరికా వీసాలను మరింత టైట్ చేశారు. ఇక, మెుదటి నుండీ చెబుతున్నట్లు టారిఫ్ వార్ కూడా షురూ చేశారు. ఇందులో భాగంగా తాజాగా కొత్త సుంకాలతో లార్జ్ ప్యాకేజీని ప్రకటించి, ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై న్యూక్లియర్ బాంబ్ వేసినంత పనిచేశారు.


“లిబరేషన్ డే”గా అభివర్ణించిన సుంకాల సమరం

ఈ నిర్ణయం.. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్‌ని పెంచే ప్రయత్నంలో ప్రత్యర్థి దేశాలతో పాటు మిత్రదేశాల్లోనూ ఆందోళనను పెంచింది. ట్రంప్ టోన్‌లో “లిబరేషన్ డే”గా అభివర్ణించిన ఈ సుంకాల సమరం… అమెరికా సంవత్సరాలుగా అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో 195 దేశాలు ఉంటే.. అందులో 180కి పైగా దేశాలపైన ట్రంప్ టారిఫ్‌లతో రెచ్చిపోయారు. అయితే, ఈ చర్య ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందని… చివరికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా బలహీనపరుస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి

అమెరికా ఆర్థిక విధానాన్ని తిరిగి రాయడమే లక్ష్యంగా ట్రంప్ ఇలాంటి భారీ సుంకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇది మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసే పరిస్థితిని తీసుకొస్తుందనే వాదన కూడా బలంగానే ఉంది. పరస్పర సుంకాల పేరుతో ట్రంప్ వేస్తున్న తాజా టారీఫ్‌లు… విదేశాలు అమెరికన్ వస్తువులపై విధించే సుంకాలకు ప్రతిగా సుంకాలను విధించడంలో భాగంగా ఉంది. ఈ ప్రణాళిక ఏప్రిల్ 3 నుండి అమలులోకి వస్తోంది. దీని ప్రకారం.. అమెరికా దిగుమతి చేసుకున్న ఆటోమొబైల్స్‌పై కొత్తగా 25% సుంకం ఉంటుంది.

“డర్టీ 15″గా ముద్ర వేసిన దేశాలే లక్ష్యంగా ఎక్కువ సుంకాలు

ఇక, జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి ఉక్కు, అల్యూమినియం, ఇతర దిగుమతులపై ఇప్పటికే బిలియన్ల కొద్దీ సుంకాలు విధించబడిన నేపథ్యంలో ఆ తాజా చర్యతో మరిన్ని సుంకాల మోత మోగనుంది. అలాగే, ట్రంప్ “డర్టీ 15″గా ముద్ర వేసిన దేశాలే లక్ష్యంగా ఇంకా ఎక్కువ సుంకాలను వేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ డర్టీ 15 దేశాలు… రక్షణాత్మక విధానాలతో తమ సొంత పరిశ్రమలను కాపాడుకుంటూ… ఓపెన్ యుఎస్ మార్కెట్లను దోపిడీ చేశాయని ట్రంప్ చెబుతున్నారు.

అన్ని దిగుమతులపై 10% బేస్‌లైన్ సుంకాలు

గతేడాది, ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చేసిన టారిఫ్ ప్రతిపాదనకు అనుగుణంగా… అన్ని దిగుమతులపై 10% బేస్‌లైన్ సుంకాన్ని ట్రంప్ నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్, చైనాతో సహా దాదాపు 60 వాణిజ్య భాగస్వాముల నుండి అధిక రేట్ల భారం అమెరికాపై పడుతుందనే కారణంతో ఇలాంటి వాణిజ్య విధానాలకు ట్రంప్ పూనుకున్నారు. అయితే, దీనివల్ల వాణిజ్య యుద్ధం తీవ్రతరం అయితే, అది అమెరికన్లకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని.. అమెరికాలో వృద్ధి మందగించే అవకాశం ఉందని.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాంద్యంలోకి నెట్టబడతాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇక, అమెరికన్ కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం ప్రకారం… అమెరికా దిగుమతి పన్నులు 2034 నాటికి $2.2 ట్రిలియన్ ఆదాయాన్ని పెంచుతాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా చైనాపై సుంకాలను మరింత పెంచారు. విదేశీ కార్లు, ఉక్కు, అల్యూమినియం నుండి దిగుమతులపై సుంకాలను పెంచారు. ఇక, మెక్సికో, కెనడా నుండి కొన్ని వస్తువులపై 25% సుంకాలను పెంచారు.

Also Read: డ్రామారావు కొత్త డ్రామాలు.! ఏది నిజం.? ఏది అబద్ధం.?

ట్రంప్ టారిఫ్ లిస్ట్ చూస్తుంటే.. చిన్న దేశాలపై కూడా అధిక సుంకాలు

ప్రస్తుతానికి, ఈ తాజా మార్పులు… అమెరికాకు అత్యంత సన్నిహిత వాణిజ్య భాగస్వాములైన మెక్సికో, కెనడాలపై భారీ భారం వేయట్లేదని వైట్ హౌస్ తెలిపింది. కానీ, ఇతర మిత్రదేశాలైన యునైటెడ్ కింగ్‌డమ్‌కి 10% నుండీ యూరోపియన్ యూనియన్‌కు 20% సహా… కొత్త సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇక, ఈ చర్యతో చైనా నుండి దిగుమతయ్యే వస్తువులపై కొత్తగా 34% సుంకాన్ని పెంచింది. ఇది ఇప్పటికే ఉన్న 20% లెవీతో పాటు మొత్తం సుంకాలను కనీసం 54%కి తీసుకెళ్లింది.

అలాగే, జపాన్ నుండి వచ్చే వస్తువులపై 24%.. ఇండియా నుండి దిగుమతయ్యే వస్తువులపై 26% సుంకం రేటును ఉంచింది.
మరోవైపు, వియత్నాం నుండి వచ్చే వస్తువులపై 46% సుంకం విధించగా… , కంబోడియాకు 49% ప్రభావం పడుతుంది. ఇంకా… దక్షిణ ఆఫ్రికా దేశమైన లెసోతో నుండి వచ్చే ఉత్పత్తులు ఏకంగా 50% టారిఫ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా ట్రంప్ టారిఫ్ లిస్ట్ చూస్తుంటే… చాలా చిన్న దేశాలపై కూడా అధిక సుంకాలు పడతాయని స్పష్టంగా అర్థం అవుతుంది.

ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామన్న భారత వాణిజ్య శాఖ

అయితే, ట్రంప్ వేసిన టారీఫ్ చార్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ రేట్లు చూస్తుంటే… ప్రతి దేశం అమెరికా నుండి వసూలు చేస్తున్న దానిలో దాదాపు సగంగా కనిపిస్తున్నాయి. అయితే, ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత… భారత్ దీనిపై వ్యూహాత్మకంగా స్పందించింది. అమెరికా వాణిజ్య విధానంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో.. ఎలాంటి ప్రభావం ఉంటుందనేది అధ్యయనం చేస్తున్నట్లు భారత వాణిజ్య శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా, టారిఫ్ ప్రభావాలపై అభిప్రాయాన్ని సేకరించడానికి, పరిస్థితిని అంచనా వేయడానికి పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులతో సహా వాటాదారులందరితో వాణిజ్య శాఖ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

$500 బిలియన్లకు పెంచడం లక్ష్యంగా ‘మిషన్ 500’

నిజానికి, 2030 నాటికి అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్‌లు ఫిబ్రవరి 13, 2025న ‘మిషన్ 500’ను ఆవిష్కరించారు. ఈ రెండు దేశాల వాణిజ్య అధికారులు… ప్రస్తుతం సరఫరా గొలుసు ఏకీకరణతో సహా పరస్పర ప్రయోజనాలను పరిష్కరించే సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా జరుపుతున్నాయి. ఇందులో భాగంగా… వాణిజ్య వృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక బదిలీలను మెరుగుపరచడం లక్ష్యంగా చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాటకీయ పరిణామాల మధ్య… ‘లిబరేషన్ డే’ పేరుతో కొత్త సుంకాలను విధించడం ద్వారా అమెరికా వాణిజ్య విధానంలో పెద్ద మార్పు రావడంతో పాటు.. ఈ కొత్త విధానం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని ఆందోళనలు వస్తున్నాయి. ప్రపంచ అధినేతలు, వ్యాపారాలు, పెట్టుబడిదారులు ప్రతీకార చర్యలకు దిగేతే అది అంతర్జాతీయంగా అస్థిర మార్కెటట్కు కారణం అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా, ఇటాలియన్, ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాగే, అమెరికా దేశీయ ఖర్చులపై గణనీయమైన ప్రభావం కూడా ఉండొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశాలను పెంచుతుందనే అభిప్రాయం ఉంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×