BigTV English

Delhi Airport: ఎయిర్‌పోర్టులో వృద్ధుడికి గుండెపోటు..సీపీఆర్‌తో ప్రాణం పోసిన వైద్యురాలు(వీడియో వైరల్)

Delhi Airport: ఎయిర్‌పోర్టులో వృద్ధుడికి గుండెపోటు..సీపీఆర్‌తో ప్రాణం పోసిన వైద్యురాలు(వీడియో వైరల్)

Doctor Conducts CPR on 60 year old at Delhi Airport: గుండెపోటు సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందిరికీ సమస్యగా మారింది. అయితే కొంతమంది సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటన తాజాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఓ వృద్ధుడికి గుండెపోటు రావడంతో వెంటనే సీపీఆర్ చేయడంతో ప్రాణాలు దక్కాయి.


ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 వద్ద 60 ఏళ్ల వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ఓ వైద్యురాలు కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన ఆ వృద్ధుడికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎయిర్ పోర్టులోని ఫుడ్ కోర్టు వద్ద వృద్ధుడు అసస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులు ఆయన చుట్టూ చేరిపోయారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఓ వైద్యురాలు వెంటనే స్పందించింది. కుప్పకూలిన ఆ వృద్ధుడి ఛాతిపై నొక్కుతూ సీపీఆర్ చేసింది. దీంతో ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. వెంటనే ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు.


Also Read: రీల్స్ కోసం భారీ వరదల్లో యువకుడి విన్యాసాలు..

అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడినందుకు వైద్యురాలిపై సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ వైద్యులంటే ఇలా ఉంటారని కొంతమంది పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Related News

Viral Video: సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. తోసి తిట్టేసిన జయాబచ్చన్, వైరల్ వీడియో

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Big Stories

×