Surya Grahan 2025: శని అమావాస్య, సూర్యగ్రహణం యొక్క అరుదైన కలయిక మార్చి 29, 2025న జరుగుతోంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు, చర్యలను పాటించడం ద్వారా.. మీరు గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. అంతే కాకుండా మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
మార్చి 29, 2025న సూర్యగ్రహణం.. శని అమావాస్య యొక్క అరుదైన యాదృచ్చిక సంయోగం జరగబోతోంది. సూర్యగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున.. శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతే కాకుండా ఇదే రాశిలో మార్చి 29న సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది.
మీన రాశిలో శని సంచారము, సూర్యగ్రహణ సంయోగం కొన్ని రాశులకు శుభాలను అందిస్తుంది. అంతే కాకుండా మరికొన్ని రాశులకు సవాళ్లను తెచ్చిపెడుతుంది. అందుకే సూర్యగ్రహణం ఏర్పడే రోజున ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు ఇబ్బందులను నివారించవచ్చు. మార్చి 29 న ఏర్పడే అరుదైన సంయోగం రోజు కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు.
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు సూర్యకాంతి భూమిని చేరుకోలేకపోతుంది. ఫలితంగా సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సంవత్సరం.. మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న జరుగుతుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటల వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా సూర్యగ్రహణం చాలా ముఖ్యమైనది. దీనితో పాటు.. శని అమావాస్య రోజు శని ప్రభావాన్ని పెంచుతుంది.
మీన రాశిలో శని సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశులకు ఇబ్బందులు కలిగించే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ రోజు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు
సూర్య గ్రహణం రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి :
సూర్యగ్రహణం సమయంలో వివాదం లేదా తగాదాకు దూరంగా ఉండాలి. మీరు ఇలా చేయకపోతే.. మీ జీవితం మరింత కష్టతరం కావచ్చు.
గ్రహణం సమయంలో వ్యాపారం ప్రారంభించడం లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం వంటి కొత్త పనులను ప్రారంభించడం శుభప్రదం కాదు. గ్రహణం ప్రభావం వల్ల కొత్త పనులకు ఆటంకం కలిగే అవకాశం కూడా ఉంటుంది.
గ్రహణ సమయంలో మతపరమైన కార్యకలాపాలు చేయడం మానుకోండి. మీరు పూజ లేదా ఇతర ఆచారాలు చేయాలనుకుంటే.. గ్రహణం తర్వాత శాంతియుతంగా , పూర్తి భక్తితో చేయండి. గ్రహణం సమయంలో.. మతపరమైన కార్యకలాపాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి.
సూర్యగ్రహణం సమయంలో మాంసాహారం తీసుకోకూడదు. మాంసాహారం, మద్యం, అతిగా వేయించిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. మీ శరీరం, మనస్సును ఉత్తేజపరిచే తేలికైన, సాత్విక ఆహారాలను తినండి.
శని అమావాస్య రోజున.. పొరపాటున కూడా ఆవు, కుక్క లేదా కాకి వంటి ఏ జంతువును బాధించకూడదు. లేకపోతే శని ఆగ్రహానికి మీరు గురికావాల్సి వస్తుంది.
Also Read: కుజుడి సంచారం.. ఏప్రిల్ 3 నుండి వీరికి ఆకస్మిక ధనలాభం
మీరు ఏదైనా చెడు పనులలో పాల్గొంటే దానికి దూరంగా ఉండండి. చెడు పనులు చేసేవారు శని దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
శని అమావాస్య నాడు.. మీ తల్లిదండ్రులను, గురువును, పెద్దలను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకండి.
శని అమావాస్య రోజున గడ్డం, గోర్లు, జుట్టు కత్తిరించుకోకండి. మత విశ్వాసం ప్రకారం.. ఇలా చేయడం వల్ల శని దోషం వస్తుంది.
శని అమావాస్య రోజున అవసరంలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయండి.