Allu Arjun: పుష్ప2 (Pushpa 2) సినిమాతో.. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1871 కోట్లు రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్. సుకుమార్, అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ బద్దలైపోయింది. ముఖ్యంగా.. నార్త్ ఇండియాలో దుమ్ముదులిపేశాడు పుష్పరాజ్. దీంతో.. పుష్ప 2 సినిమా తర్వాత, తదుపరి ప్రాజెక్ట్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా మూవీ లవర్స్. వాస్తవానికైతే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా కోసం బన్నీ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ టచ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. కానీ ముందుగా అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.
త్రివిక్రమ్ సినిమా దేశమే ఆశ్చర్యపోయేలా..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. బన్నీ లుక్ కోసమే కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నారట. జూన్ వరకు ఫస్ట్ లుక్ డిజైన్ పై ఒక క్లారిటీ రానుందట. మైథలాజికల్ కంటే ముందు కాలానికి చెందిన సినిమాగా ఇది ఉంటుందట. అసలు ఇప్పటి వరకు అలాంటి కథతో సినిమా రాలేదట. 2026 ఎండింగ్, 2027లో సినిమా రిలీజ్ ఉంటుందని.. నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రమోషన్స్‌లో చెబుతున్నాడు. మన పురాణాల్లో ఎవరికీ అంతగా తెలియని ఓ కథతో రూపొందించనున్నామని.. అలాగని ఇది పూర్తిగా ఫిక్షనల్ పాత్రేమీ కాదని అంటున్నాడు. పురాణాల్లోని ఆ దేవుడు గురించి అందరికీ తెలిసినప్పటికీ.. తన జీవితంలో జరిగిన విషయాలు ఎవరికీ అంతగా తెలియదు. ఆ కోణాన్నే మేము ఈ చిత్రంలో భారీ స్కేల్‌లో చూపించనున్నాం.. అని చెప్పారు నాగవంశీ. దీంతో.. త్రివిక్రమ్ సినిమా పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండు సినిమాలు ఒకేసారి?
అలాగే.. అట్లీ (Atlee) సినిమా గురించి చెబుతూ.. త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కూడా బిగ్ స్కేల్‌తో రాబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే.. ముందు అట్లీ సినిమా చేసి, తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడని భావించారు. కానీ బన్నీ ఈ రెండు సినిమాలను ఒకేసారి ప్యారలల్‌గా ప్లాన్ చేస్తున్నాడని.. బన్నీ అలా చేయడానికి గట్టిగా ఫిక్స్ అయ్యారని.. నాగవంశీ అన్నారు. లుక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటునే.. ఈ సినిమా చేస్తామని.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. బన్నీ కూడా ఇక నుంచి ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. పుష్ప సినిమా కోసం మూడు నాలుగేళ్లు పని చేశాడు బన్నీ. అందుకే.. అట్లీ సినిమా మొదలైన కొద్ది రోజులకే.. త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాడు. మొత్తంగా.. బన్నీ ఒకేసారి ఈ రెండు సినిమాలు చేయడానికి గట్టిగా ఫిక్స్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాల జానర్స్ టోటల్లీ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి. కోలీవుడ్ దర్శకుడు అట్లీ అంటే.. కమర్షియల్ మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈసారి కొత్తగా పాన్ ఇండియా మైథలాజికల్ బాట పడుతున్నాడు.