Rashmika Mandanna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. రీసెంట్గా పుష్ప 2, ఛావా సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు చేతినిండా సినిమాలతో మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) తో రూపొందుతున్న ‘సికిందర్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. హిందీ తోపాటు తెలుగు, తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇంకొంతమంది స్టార్ హీరోలైతే ఏకంగా రష్మిక డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కూడా. దీన్ని బట్టి చూస్తే రష్మిక క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అభిమానులతో ముచ్చటించిన రష్మిక..
ఇదిలా ఉండగా ఛావా సినిమా షూటింగ్ సమయంలో జిమ్లో వ్యాయామం చేస్తుండగా రష్మిక గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె కుడి పాదానికి గాయం అవ్వడంతో.. సినిమా షూటింగ్ ల నుంచి చిన్నచిన్నగా బ్రేక్ తీసుకుంది. కాలు నొప్పి ఉన్నా కూడా ఛావా సినిమా ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొని, వీల్ చైర్ లోనే ప్రమోషన్స్ కి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుందని రష్మిక చెప్పుకొచ్చింది. తాజాగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించిన రష్మిక అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపింది.
ఆ గాయం మానడానికి 9 నెలలు పడుతుంది -రష్మిక
ఇక అందులో భాగంగానే.. ఒక అభిమాని కాలికి తగిలిన గాయం గురించి అడగగా.. రష్మిక ఈ విధంగా సమాధానం తెలిపింది.రష్మిక మాట్లాడుతూ ..” కాలికి తగిలిన గాయం ఇప్పుడిప్పుడే నయం అవుతోంది. కానీ పూర్తిగా సెట్ కావాలి అంటే మరో తొమ్మిది నెలల సమయం పడుతుంది. అయితే నొప్పి ఉన్నా కూడా సినిమాలో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా కాలు నొప్పితో బాధపడుతూనే మరొకవైపు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె పట్టుదలకి సినిమాలపై ఈమెకు ఉన్న ఫ్యాషన్ కి అటు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
ALSO READ;Sampoornesh Babu: రీ ఎంట్రీ ఇస్తున్న సంపూ.. కం బ్యాక్ అవుతారా..?
రష్మిక మందన్న సినిమాలు..
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తున్న ఈమె అలాగే ధనుష్(Dhanush ), నాగార్జున(Nagarjuna ) ప్రధాన పాత్రలో వస్తున్న ‘కుబేర’ సినిమాతో పాటు ‘థమ్’ అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. ఇకపోతే త్వరలో సికిందర్ సినిమా విడుదల కానుండగా.. ఈ సినిమాకి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితోపాటు రెయిన్బో , ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలలో కూడా రష్మిక నటిస్తోంది. ఏది ఏమైనా 28 సంవత్సరాల వయసులోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని వరుస సినిమాలతో బిజీ అయిన ఈమె అంతకుమించి ప్రాపర్టీ కూడా కూడబెట్టిన విషయం తెలిసిందే .ఒక మొత్తానికైతే ఈ నేషనల్ క్రష్ కాస్త మరింత బిజీగా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పవచ్చు.