BigTV English
Advertisement

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Dussehra 2024 Date: హిందూ గ్రంథాల ప్రకారం ప్రతీ పండుగకు ఓ ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అశ్వినీ మాసంలో వచ్చే దసరా పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ‘అధర్మంపై ధర్మం’, ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక’గా ప్రతీ ఏటా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజున రావణుడిని దహనం చేయడంతో పాటు, దుర్గా భవాని అమ్మవారు మహిషాసురుడిని సంహరించిందని శాస్త్రాలలో చెప్పబడింది. అందుకే ఈ రోజును విజయదశమి అని కూడా అంటారు.


విజయానికి ప్రతీకగా విజయదశమి

ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా కుంభకరణం, రావణుడు మరియు మేఘనాథుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. దీనినే రావణ దహనం అని కూడా పిలుస్తారు. మరోవైపు మత గ్రంధాల ప్రకారం, దశమి తిథి నాడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు రావణుడిని చంపి విజయం సాధించాడు అని కూడా చెబుతుంటారు. అందుకే ఈ పండుగను అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో జమ్మి చెట్టుకు పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గా భవానీ అమ్మవారి ఎదుట జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పంచిపెట్టి అలాయ్ బలాయ్ తీసుకుంటారు.


దసరా పండుగ తేదీ, శుభ సమయం

పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇది మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 12 వ తేదీన దసరా పండుగను జరుపుకోనున్నారు. మధ్యాహ్నం పూజ సమయం మధ్యాహ్నం 1:17 నుండి 3:35 వరకు ఉండనుంది. విజయ ముహూర్తంలో రావణ దహనం జరుగుతుంది. ఈ రోజు విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:03 నుండి 2:49 వరకు ఉంటుంది. ఈ సమయంలో రావణ దహనం చేయవచ్చు.

విజయదశమి ప్రాముఖ్యత

దసరా పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తొమ్మిది రోజుల పాటు దుర్గా భవానీ అమ్మవారి వివిధ రూపాలను పూజిస్తుంటారు. తిరిగి విజయదశమి నాడు అమ్మవారు మహిశాసుర మర్థిని రూపంలో అవతరించి మహిశాసురుడు అనే రాక్షసుడిని సంహరించిందని నమ్ముతారు. అంతేకాదు శ్రీ రామ చంద్రుడు రావణుడిని దహనం చేయడం ద్వారా అధర్మంపై ధర్మం గెలిచిందని నమ్ముతారు. ఈ క్రమంలో విజయదశమి నాడు రాక్షసుడి బొమ్మ లేదా రావణుడి బొమ్మను దహనం చేసి సంబరాలు చేసుకుంటారు. తిరిగి మరుసటి రోజున అమ్మవారి విగ్రహాన్ని గంగానదిలో నిమర్జనం చేస్తారు.

దసరా నాడు పూజ సమయంలో ఈ మంత్రాలను జపించండి

⦿ రామ్ ధ్యాన మంత్రం

ఓం ఆప్దమప్ హర్తారం దాతారం సర్వ సంపద,

లోకాభిరం శ్రీ రామ భూయో భూయో నమామ్యహం!

శ్రీ రామయ్ రామభద్రాయ రామచంద్రాయ వేద్సే,

రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః!

⦿ శ్రీ రామ్ గాయత్రీ మంత్రం

ఓం దాశరథ్యే విద్మహే జానకీ వల్లభయ్ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ ॥

⦿ రామ్ మూల్ మంత్రం

ఓం హ్రాం హ్రీం ర రామాయ నమః ।

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×