BigTV English
Advertisement

Pancha Graha Kutami 2024: జూన్ 5న పంచగ్రహ కూటమి..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..!

Pancha Graha Kutami 2024: జూన్ 5న పంచగ్రహ కూటమి..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..!

2024 Pancha Graha Kutami on 5th June: శుక్ర, చంద్ర గ్రహాలు మకరరాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రెండు గ్రహ పరిణామాలు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అనే సందేహం చాలామందిలో వెలువడుతోంది. అయితే పంచగ్రహ కూటమి వల్ల కొందరు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జోతిష్య శాస్త్రంలో గ్రహకూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది. అరుదైన గ్రహకూటమి జూన్ నెలలో 5,6 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని కూడా అంటారు. జూన్ 5వ తేదీ ఉదయం 10:37 నిమిషాలకు శుక్రుడు..అదే రోజు మధ్యాహ్నం 02:22 చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ ,బుధ, శని గ్రహాలు ఉన్నాయి. కొత్తగా శుక్ర, చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది.

పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అయితే అలాంటి రాశుల వారు సూచించిన గ్రహశాంతులు జరుపుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. జన్మకుండలిలోని జాతక దోషాలు ఉన్నవారు గ్రహ శాంతి చేయించుకోవాలి.


Also Read: శ్రీ రాముడంతటి వాడే పితృ దోషాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.. దానిని నివారించడానికి ఈ అద్భుత చర్యలు పాటించండి

కర్కాటక రాశి:
ఈ రాశి వారు వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. కుటుంబ కలహాల నుంచి బయటపడాలంటే సామరస్యంగా మాట్లాడడం ఉత్తమం. అంతేకాకుండా శివుడి ఆరాధన వీరికి కలిసి వస్తుంది.

మిథున రాశి:
పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. నమ్ముకున్న వారి చేతిలోనే వీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అవివాహితులు సామరస్యంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Also Read: వృషభరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక డబ్బుల పండగే..

కన్యా రాశి:
ధనం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం గడిపేవారు కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం. అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. నవగ్రహాల్లో కుజుడికి ఎర్రటి పూలను సమర్పించాలి. హనుమంతుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Tags

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×