BigTV English

CM Revanth Reddy: ఛాతీలో బాణం దిగిన యువకుడిని కాపాడిన వైద్యులు.. అభినందించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: ఛాతీలో బాణం దిగిన యువకుడిని కాపాడిన వైద్యులు.. అభినందించిన సీఎం రేవంత్

CM Revanth Reddy Appreciated NIMS Doctors: నిమ్స్ వైద్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సోషల్ మీడియా వేదిక వారికి సీఎం కితాబిచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం స్పందిస్తూ నిమ్స్ వైద్యులకు అభినందనలు తెలిపారు. ప్రజల్లో నిమ్స్ పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారంటూ కితాబిచ్చారు. అదేవిధంగా భవిష్యత్తులో నిమ్స్ మరింతగా అభివృద్ధి చెంది విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.


కాగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆదివాసీ యువకుడికి వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగింది. ఆ బాణం సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్యలో దిగటంతో బాధితుడిని కుటుంబ సభ్యులు భద్రాచలం ఆసుపత్రికి, ఆ తరువాత వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Also Read: శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం.. 30 లక్షల ఉద్యోగాల భర్తీ..


అయితే, పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్ కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. నిమ్స్ లో వైద్యులు అతడికి దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి ఛాతీలో దిగిన బాణాన్ని తీసి, యువకుడిని కాపాడారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారు.

అయితే, యువకుడు ఆసుపత్రికి వెళ్లగానే మొదటగా వైద్యులు తొలుత సీటీస్కాన్ తీశారు. లంగ్స్ పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే అప్పటికే తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో అతడికి ఒకవైపు రక్తాన్ని ఎక్కిస్తూనే నాలుగు గంటలపాటు శస్త్రచికిత్స చేసి ఛాతీలోంచి బాణాన్ని తొలగించారు. అయితే, బాణం చొచ్చుకుపోయిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు.

‘గిరిజన యువకుడు సోది నంద ఛాతిభాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్య బృందానికి నా అభినందనలు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దావాఖాన పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు. భవిష్యత్ లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×