BigTV English

KarmaNasha Nadi: ఈ నది నీటిని ముట్టుకోవాలంటే అక్కడి ప్రజలు వణికిపోతారు, ఇది ఒక శాపగ్రస్త నది

KarmaNasha Nadi: ఈ నది నీటిని ముట్టుకోవాలంటే అక్కడి ప్రజలు వణికిపోతారు, ఇది ఒక శాపగ్రస్త నది

మనదేశంలో నదులను ఎంతో పవిత్రంగా చూస్తారు. నదిని కూడా తల్లిగా భావిస్తారు. వాటిని పూజిస్తారు. కానీ మన దేశంలో ఒక్క ఉన్న ఒక నది గురించి చెబితే మాత్రం అక్కడి ప్రజలు వణికిపోతారు. ఆ నీటిని తాకడమే అశుభం అని భావిస్తారు. ఆ నది వైపు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. నదిని దేవతలా పూజించే మన దేశంలో ఇలాంటి ఒక ప్రాంతం ఉందని చెబితే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఆ నది గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.


ఇదే ఆ నది
ఆ నది పేరు కర్మనాశ. కర్మ, నాశ అనే రెండు పదాలతో కలిపి ఈ నదికి ఆ పేరును పెట్టారు. ఈ నది నీటిని తాగితే ఆ ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయని, అది ఎంతో ప్రమాదకరమని అక్కడ ప్రజలు భయపడుతూ ఉంటారు.

కర్మనాశ అని పిలిచే ఈ నది బీహార్ లోని కైమూర్ జిల్లాలో ఉంది. ఈ నది దగ్గరికి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడరు. ఎప్పుడూ ఈ నది తీరం శూన్యంగా ఉంటుంది. ఈ నది నీటిని ముట్టుకోవడానికి ప్రజలు ఇష్టపడరు. కాబట్టి ఈ నది ఒడ్డున ఒక్క మనిషి కూడా కనిపించడు. ఈ నది నీటిని తాగితే తన జీవితంలో చేసిన అన్ని పుణ్యాలు నాశనం అవుతాయని ఒక నమ్మకం ఉంది. తన ధర్మాలు, పుణ్యాలు, కర్మలు అన్నీ నశించి శాపగ్రస్త మనిషిగా మారుతామేమోనని అక్కడ ప్రజలు భయపడుతూ ఉంటారు. అందుకే ఈ నది దగ్గరికి వెళ్లే సాహసం చేయరు.


కర్మనాశా నది గంగానదికి ఉపనదిగా చెప్పుకుంటారు. బీహార్ లోని కైమూరు జిల్లాలో ఉద్భవించిన ఈ నది ఉత్తరప్రదేశ్, బీహార్ గుండా ప్రవహిస్తుంది.

నది వెనుక కథ
ఈ నది గురించి ఎన్నో కథనాలు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. హరిశ్చంద్రుడు తండ్రి సత్యవ్రతుడు. అతను ఒకసారి తన గురువైన వశిష్టుడితో మాట్లాడుతూ తాను భౌతికంగా జీవించి ఉండగానే స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు చెబుతాడు. కానీ వశిష్ఠుడు దానికి ఒప్పుకోడు. అప్పుడు సత్యవతుడు విశ్వామిత్రుడికి ఇదే కోరికను కోరుతాడు. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఉన్న శత్రుత్వం కారణంగా విశ్వామిత్రుడు ఆ పని చేసేందుకు ఒప్పుకుంటాడు. తన తపోశక్తితో విశ్వామిత్రుడు, సత్యవ్రతుడిని స్వర్గానికి పంపుతాడు.

ఇది చూసిన ఇంద్రుడికి కోపం వస్తుంది. వెంటనే సత్యవ్రతుడిని భూమికి విసిరేస్తాడు. అయితే విశ్వామిత్రుడు తన తపోశక్తి ద్వారా ఆ సత్యవ్రతుడిని స్వర్గానికీ, భూమికి మధ్యనే ఉంచి దేవతలతో పోరాడుతాడు. సత్యవ్రతుడు స్వర్గం, భూమి మధ్య తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. అతడికి నోటి నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. ఆ లాలాజలం వల్లే ఈ కర్మనాశ నది అన్నది ఏర్పడిందని చెబుతారు. అలా స్వర్గానికి భూమికి మధ్య వేలాడుతూ ఉండడం వల్లే ఇతడికి త్రిశంకు అనే పేరు కూడా వచ్చింది.

త్రిశంకు లాలాజలంతో ఉద్భవించిన ఈ నది కూడా శాపగ్రస్తంగానే చెప్పుకోవడం ప్రారంభించారు. పూర్వం ఈ కర్మనాశ నది పక్కన ఎంతో మంది ప్రజలు నివసించే వారని అంటారు. ఆ ప్రజలు కర్మనాశ నది నుండి తీసుకొచ్చిన నీటిని వాడేందుకు ఇష్టపడేవారు కాదట. దానికి బదులు భూమిపై దొరికే పండ్లు తిని బతికేవారని చెప్పుకుంటారు. అలాగే నీటి కోసం ఎంతో దూరం వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇక్కడ ఉన్న ఈ శాపగ్రస్తా నది నుండి మాత్రం వాడేందుకు ఇష్టపడేవారు కాదని చెబుతారు.

ఈ నది కేవలం 192 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంటుంది. చివరికి గంగానదిలో విలీనం అయిపోతుంది. బీహార్ లోనే అతి చిన్న నది ఇదే. అయినా కూడా దీనికి ఉపనదులు ఉన్నాయి. అలాగే ఈ నది వల్ల కొన్ని జలపాతాలు కూడా ఏర్పడతాయి.

చరిత్రలో కూడా కర్మనాశ నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1539లో జరిగిన చౌసా యుద్ధం ఈ నది దగ్గరే జరిగిందని చెప్పకుంటారు. ఈ యుద్ధంలో షేర్షా సూరి మొఘల్ చక్రవర్తి అయినా హుమయూన్ ను ఓడించాడని అంటారు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×