BigTV English

Lavish Flowers : సంపంగి పూలతో పూజ ఫలితాలివి

Lavish Flowers : సంపంగి పూలతో పూజ ఫలితాలివి
Lavish Flowers

Lavish Flowers : సాధారణంగా చెట్టునుంచి ఆరోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని రకాల పువ్వలను రోజులపాటు నిలువ ఉంచిన తరువాత కూడా భగవంతుని పూజకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. కలువపూలను ఐదు రోజులవరకు, కమలాలను పదకొండు రోజులవరకు నిలువ ఉంచినప్పటికి పూజకు వాడుకోవచ్చని భవిష్యపురాణం చెబుతోంది. బిల్వ పత్రాలను, తులసీదళాలను, అవిశపూలను, వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు చిద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని ‘మేరుతంత్రం’ చెబుతోంది


ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది.ఆయుష్షుకోసం దుర్వారపూలతో, సంతానంకోసం దత్తొరపూలతో రుద్రదేవుని పూజించాలట. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలిపూవులు, ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు, శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిరమాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల విశేష ఫలితాలు కలుగుతాయని నమ్మకం.

సంపంగి పూలతో శివుడి పూజ చేయకూడదు. కానీ శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. సంపంగి పూలతో పూజచేయనివాడు మరుజన్మలో సువర్ణ రత్నాలా హీనుడవుతాడట. పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది. సంపంగి పువ్వు వాసన, రంగు అన్ని ప్రత్యేకమే. ఎండాకాలంలో అలా సాయంత్రం వేళ నడిచి వెళ్తుంటే ఊర్లో దార్లన్నీ ఇదే పరిమళం.


Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×