BigTV English

NTR : RRRకు ఆస్కార్ అవార్డు.. ఆమెకే తొలి ఫోన్ కాల్.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

NTR : RRRకు ఆస్కార్ అవార్డు.. ఆమెకే తొలి ఫోన్ కాల్.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

NTR : విశ్వవేదికపై తెలుగు సినిమా RRR సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న RRR టీమ్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి భారత్ కు చేరుకుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే యంగ్ టైగర్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.


ఆస్కార్‌ వేడుక అనుభూతులను ఎన్టీఆర్ పంచుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చిన వెంటనే తొలుత తన భార్యకు ఫోన్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించారు. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ అవార్డును తీసుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోనని భావోద్వేగంతో చెప్పారు. అదే తన బెస్ట్‌ మూమెంట్‌ అని NTR పేర్కొన్నారు.

మన దేశం మాదిరిగానే ఆ అవార్డు ఎంతో గొప్పగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. అదొక అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నారు. ఆ అనుభూతులను మాటల్లో వర్ణించలేనన్నారు. భారతీయుడిని, తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నానని ఎన్టీఆర్ చెప్పారు. తాము ఇంత గౌరవాన్ని దక్కించుకోవడానికి కారణం అభిమానులు, సినీప్రేమికులేనని ఎన్టీఆర్ స్పష్టంచేశారు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైందని చెప్పుకొచ్చారు.


Naatu Naatu: నాటు నాటుకు ఆస్కార్ అందుకే.. పాటలో పదును ఇదే

Dil Raju: దిల్ ‘రాజు’ రాజకీయ ‘బంటు’నా?.. ఆ హడావుడి అందుకేనా?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×