BigTV English

Pooja Room: పూజ గది ఏ దిక్కున ఉంటే అదృష్టమో తెలుసా ?

Pooja Room: పూజ గది ఏ దిక్కున ఉంటే అదృష్టమో తెలుసా ?

Pooja Room: ఏ ఇంటినైనా దాదాపు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించకపోతే, అది కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా వారి పురోగతి కూడా ఆగిపోతుంది. ఇంట్లో తగాదాలు , ఇబ్బందులు పెరుగుతాయి. వాస్తు ప్రకారం.. పూజ గదిని ఈశాన్య మూలలో, అంటే ఉత్తరం , తూర్పు దిశల మధ్య నిర్మించాలి. ఈ దిశ పూజకు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అంతే కాకుండా ఈశాన్య మూలను బృహస్పతికి దేవుడి దిశగా భావిస్తారు. పూజలు చేయడానికి.. భక్తులు తూర్పు ముఖంగా కూర్చోవాలి.


పూజ గది నియమాలు:
ఇంట్లోని పూజ గదిలో దేవుడి విగ్రహాన్ని ఉంచేటప్పుడు.. కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. విగ్రహం వెనక భాగాన్ని ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచండి. వాస్తు ప్రకారం.. పూజ గదిని ఎప్పుడూ మెట్ల క్రింద నిర్మించకూడదు. అలాగే.. పూజ గదిని ఎప్పుడూ బెడ్ రూమ్, బాత్రూమ్ లేదా టాయిలెట్ దగ్గర నిర్మించకూడదు.

– మీరు దేవుళ్లు, దేవతలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. ఏ దేవుడి విగ్రహాలయినా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇంట్లో శివలింగం ఉండటం చాలా శుభప్రదంగా భావిస్తారు. హిందూ మతంలో శంఖానికి కూడా చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఏదైనా ప్రార్థన లేదా కథ ముగింపులో శంఖాన్ని ఊదుతారు. అయితే.. పూజ గదిలో రెండు కంటే ఎక్కువ శంఖాలను కూడా ఉంచకూడదని చెబుతారు.


– దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. ముందుగా పూజ గది నేలపై ఆవు పేడతో అలంకరించాలి. ఏ రకమైన వాస్తు దోషాన్నైనా తొలగించడానికి ఆవు పేడ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. పూజ సమయంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం పొందాల్సిన ఫలితాలు కూడా రాకుండా ఉంటాయి.

– తరచుగా పూజలో ఉపయోగించే కొబ్బరి కాయ, బియ్యం, దీపం మొదలైన వస్తువులను నేలపై ఉంచుతారు. కానీ పూజలో ఉపయోగించే పదార్థాలను భూమిపై ఎప్పుడూ ఉంచకూడదని పండితులు చెబుతుంటారు. దీనివల్ల వాస్తు దోషం కలుగుతుందట.

Also Read: పూజ చేసేటప్పుడు శంఖం ఎందుకు ఊదుతారు ?

-అదృష్టం, శ్రేయస్సు కోసం.. మీ పూజ గదిలో లోహ స్వస్తిక్ గుర్తు ఉంచండి. రోజు పూజ చేసిన తర్వాత… గది ప్రధాన ద్వారం మీద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ పూజ చేసిన తర్వాత శంఖాన్ని ఊదడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. అంతే కాకుండా ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

-పూజ చేసేటప్పుడు చాలా మంది ధూప్ స్టిక్ ఉపయోగిస్తారు. కానీ హిందూ మతం ప్రకారం ఏ గ్రంథంలోనూ అగర్బత్తి పేరు రాయలేదు. కాబట్టి.. అగర్బత్తికి బదులుగా ధూప్ స్టిక్ వాడండి. దేవుడి కోసం వెలిగించిన దీపాన్ని ఎప్పుడూ ఊది ఆర్పకండి. దీని వల్ల దేవుడు కోపగించుకుంటాడు. అంతే కాకుండా పూజ గదిలో విరిగిన విగ్రహాలను కూడా ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×