BigTV English

RRR : దెబ్బలంటే నాకు తెలీదు.. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి!

RRR : దెబ్బలంటే నాకు తెలీదు.. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి!

RRR : ఐదేళ్ల జగన్ పాలనలో లెక్కలేనన్ని అరాచకాలు. కూల్చివేతలు, కేసులు, అరెస్టులు, కస్టోడియల్ టార్చర్లు. రఘురామ నుంచి చంద్రబాబు వరకు.. నేతలను ఎంతలా వేధించారో. ప్రభుత్వం మారాక ఆ పాపం పండుతోంది. ఆనాటి అక్రమాలకు వంత పాడిన అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. రఘురామ మాత్రం ఎక్కడా తగ్గట్లే. ఆనాడు తనను కొట్టిన వాళ్లందరి పని పట్టేలా గట్టిగా పట్టుపడుతున్నారు. సీఐడీ కస్టడీలో రఘురామను అంతగా టార్చర్ చేస్తే.. పాదాలపై అంత క్లియర్‌గా గాయాలు కనిపిస్తే.. ఒంటిపై దెబ్బలేమీ లేవంటూ అప్పటి GGH సూపరింటెండెంట్ ప్రభావతి సంతకం పెట్టడం ఇప్పుడు ఆమెకే చిక్కుగా మారింది. విచారణకు రాకుండా డాక్టర్ ప్రభావతి తప్పించుకుంటుంటే.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆమె ఎంక్వైరీకి రావాల్సిందేనని ఆర్డర్స్ తీసుకొచ్చారు. కట్ చేస్తే.. ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు 2 రోజుల పాటు విచారణకు వచ్చారు. ఎంక్వైరీలో ప్రభావతి చెప్పిన సమాధానాలు పోలీసులను షాక్‌కు గురి చేశాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే…


గాయాల గురించి తెలీదు.. గైనకాలజిస్ట్‌‌ను..

రఘురామరాజుకు తగిలిన అంతర్గత గాయాల గురించి.. డాక్టర్‌గా తనకు అంతగా అవగాహన లేదని.. తాను కేవలం గైనకాలజిస్టునని చెప్పారట ప్రభావతి. రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తనకింది అధికారులు రిపోర్టు ఇస్తే.. దానిపై తాను సంతకం చేశానని.. అంతేకానీ తనకు ఆ దెబ్బల గురించి పెద్దగా నాలెడ్జ్ లేదన్నట్టు చెప్పుకొచ్చారు. తనకు ఆనాటి విషయాలేవీ సరిగ్గా గుర్తు లేవని చెప్పారు.


ప్రభావతిపై ఆనాటి పెద్దల ప్రెజర్?

అదేంటి? అంతటి సీరియస్ కేసులో అలా సింపుల్‌గా ఎలా సంతకం పెట్టేస్తారు? GGH సూపరింటెండెంట్ హోదాలో ఏది పడితే అలా రిపోర్టులు ఇచ్చేస్తారా? లేదంటే, ఆనాడు ప్రభావతిపై పెద్ద స్థాయిలో ఒత్తిడి వచ్చిందా? ఆ పెద్దలు చెప్పినట్టే సంతకం చేశారా? ప్రభావతి ఆ పెద్దల పేర్లు చెబితే వారికి చిక్కులేనా? అనే చర్చ నడుస్తోంది.

Also Read : ఆ మంత్రితో రోజా సీక్రెట్ మీటింగ్? జగన్‌కు హ్యాండ్?

ప్రభావతిపై రఘురామ పంచ్‌లు

ఇదే విషయంపై ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సైతం స్పందించారు. తాను గైనకాలజిస్ట్ నని.. తనకు గాయాలు అంటే ఏంటో తెలియదని, సిబ్బంది ఏదో రిపోర్టు తీసుకువస్తే సంతకం పెట్టానని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుందని రఘురామ అన్నారు. ఎంబీబీఎస్ తరువాతే కదా గైనకాలజీలో కోర్సు చేసేది.. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్‌ కనీస అవగాహన లేకుండా ఉండరని.. తన గాయాల గురించి తెలీదని చెప్పడం నమ్మశక్యంగా లేదని అభిప్రాయ పడ్డారు. ఎవరి ప్రోద్భలంతోనో డాక్టర్ ప్రభావతి అలా మాట్లాడుతున్నట్టుగా ఉందని అన్నారు. పోలీసులకు దొరక్కుండా 2 నెలల పాటు తప్పించుకునే సామర్థ్యం ఉన్న డాక్టర్ ప్రభావతి.. అంత సడన్ గా ఆనాటి విషయాలు మర్చిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు రఘురామ. ఏప్రిల్ 15న కోర్టులో ఈ కేసుపై విచారణ ఉందని.. అప్పటికల్లా డాక్టర్ ప్రభావతికి జ్ఞాపక శక్తి రావాలని దేవున్ని కోరుకుంటానని రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు.

Related News

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Big Stories

×