BigTV English

Duryodhana Temple: ధుర్యోధనుడికి గుడి ఎందుకు కట్టారంటే…

Duryodhana Temple: ధుర్యోధనుడికి గుడి ఎందుకు కట్టారంటే…

Duryodhana Temple: మన దేశంలో రాముడి గుడి ఉండని ఊరు ఉండదు. ఉత్తమ పురాణ పురుషులకు ఆలయాలు నిర్మించి పూజించుకోవడం మన సంప్రదాయం. కానీ అదేమి విచిత్రమో కొందరు ప్రతినాయకులకూ ఆలయాలు ఉన్నాయి. లంకలో రావణాసురుడిని పూజిస్తారంటారు.. కానీ మన దేశంలోనే ధుర్యోధనుడికి గుడి ఉందంటే విచిత్రమే కాని నిజం.


మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. సుయోధనుడు అని ఇతనికి మరొక పేరు. ధుర్యోధనుడు పాండవులను మట్టుబెట్టాలని ప్రయత్నించాడు. మహా భారతంలో దుష్ట చతుష్టంలో ఒకడుగా నిలిచాడు. కేవలం ఐదుగురే ఉన్న పాండవులకు, తన పినతండ్రి సోదరులకు కనీసం ఐదు ఊళ్లు కూడా ఇచ్చేందుకు ముందుకు రాలేదు

ఉత్తరాఖండ్ లోని జఖోలి గ్రామంలో దుర్యోధనుడికి గుడి కట్టారు. ఈ ఆలయంలో బంగారం పూత పూసిన గొడ్డలి కూడా ఉందండోయ్. దీన్ని ధుర్యోధనుడు వాడాడని ఆ గ్రామ వాసులు నమ్ముతారు. అయితే ధుర్యోధనుడికి గుడి ఏంటని ఇతర గ్రామాల వారు ప్రశ్నించడంతో .. ఈ ధుర్యోధనుడి ఆలయాన్ని శివాలయంగా మార్చారట. కానీ లోపల మాత్రం ధుర్యోధనుడు విగ్రహం అలాగే ఉంది.


మహాభారతములోని కురుక్షేత్ర సంగ్రామంలో ఓడిపోయినా కౌరవులలో ఒకరైన దుర్యోధనుడి స్వర్గానికి వెళ్లాడని అంటారు.. పాండవులు నీతిమంతులనీ, కౌరవులు అధర్మబద్దులని చెప్పబడుతుంది కదా, అలాంటప్పుడుకౌరవులలో పెద్దవారైన దుర్యోధనుడు స్వర్గ లోకానికి వెళ్ళడానికి గల కారణమేంటి అంటే దుర్యోధనుని రాక్షసునిగా చిత్రీకరించారు, కానీ తన రాజ్యం పట్ల ప్రేమ, ఉదారతలు కలిగిన గొప్ప నీతివంతమైన రాజు అన్నది వాస్తవం. చుట్టుపక్కల పరిస్థితులను తనకు అనువుగా మలచుకోవడమే కాకుండా,. ఒక విజయవంతమైన రాజుగా తన సామర్థ్యాలను, విజయాలను ప్రతిబింబింస్తూ రాజ్య పాలనలో నిష్ణాతునిగా ఉండేవాడు.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×