BigTV English

IND vs SL: లంకపై భారత్ ఘన విజయం.. శనక శకలక.. విరాట్ కొహ్లీ వీరవిహారం..

IND vs SL: లంకపై భారత్ ఘన విజయం.. శనక శకలక.. విరాట్ కొహ్లీ వీరవిహారం..

IND vs SL: టీమిండియా చేతిలో శ్రీలంక ఘోర పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ లంకకు 374 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఛేజింగ్ లో తడబడిన లంకేయులు.. నిర్ణీయ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 రన్స్ చేశారు. శ్రీలంక కెప్టెన్ శనక (108) సెంచరీతో పోరాడినా ఓటమి తప్పలేదు. 67 పరుగుల తేడాతో ఇండియా విజయ కేతనం ఎగరవేసింది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో నిలిచింది.


అంతకుముందు.. విరాట్ కొహ్లీ వీరవిహారం చేశాడు. శ్రీలంకపై చెలరేగి ఆడాడు. 80 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. 87 బాల్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్స్ తో 113 రన్స్ చేశాడు. రోమిత్ శర్మ (83), శుభ్ మల్ గిల్ (70) సైతం రాణించడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఫామ్ లో ఉంటే కొహ్లీని అడ్డుకోవడం ఏ బౌలర్ తరం కాదు. ఇదే విషయం మరోసారి నిరూపించాడు. సెంచరీతో సచిన్ రికార్డును దాటేశాడు. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కొహ్లీ‌ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు సచిన్‌, కొహ్లీలు ఎనిమిదేసి సెంచరీలతో సమంగా ఉండగా.. ఇప్పుడు శ్రీలంకపై 9వ సెంచరీ కొట్టి.. సచిన్ ను అధిగమించాడు. శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాపైనా తొమ్మిది సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.


మరోవైపు, స్వదేశంలో 20 సెంచరీలతో సచిన్‌తో సమంగా నిలిచాడు విరాట్ కొహ్లి. భారత్ లో సచిన్‌ 164 వన్డేల్లో 20 సెంచరీలు కొట్టగా.. కొహ్లీ మాత్రం కేవలం 102 వన్డేల్లోనే 20 సెంచరీలు బాదేశాడు.

అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ సెంచరీల సంఖ్య 73కి చేరింది. 27 టెస్టు సెంచరీలు కాగా.. 45 వన్డే శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్‌లో తొలిసారి టీ20ల్లోనూ సెంచరీ చేశాడు కొహ్లి. 100 సెంచరీలు చేసిన సచిన్‌ తర్వాత.. 73 శతకాలతో అత్యధిక శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు విరాట్.

వన్డేల్లో విరాట్ కొహ్లీ 12,584 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 18,426 పరుగులతో హయ్యెస్ట్ స్కోరర్ గా టాప్ లో కొనసాగుతున్నాడు. మరి, సచిన్ రికార్డును కొహ్లీ సాధించేనా!?

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×