E-Paper
Advertisement

Rahu Transit 2024: భాద్రపద నక్షత్రంలోకి రాహు సంచారం.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

Rahu Transit 2024: భాద్రపద నక్షత్రంలోకి రాహు సంచారం.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
Advertisement

Rahu Transit in Bhadrapada Nakshatra: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహు, శని కలిసి ఉండటం వల్ల అశుభం కలుగుతుంది. జాతకంలో శని స్థానం శుభప్రదంగా ఉంటే రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. జూలై 8 ఉదయం రాహువు, శని నక్షత్రం అయిన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో రాహువు ఉన్నాడు.

జూలై 8 సోమవారం సాయంత్రం 4:11 గంటలకు రాహువు, శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి మంచిదికాదు. కానీ మరికొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వృషభ రాశి:
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలిగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం కూడా బాగుంటుంది. వృత్తి జీవితంలో మంచి విజయాలను పొందుతారు.

Also Read: శని అనుగ్రహం.. ఈ వారం రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ !

Advertisement

తులారాశి:
రాహువు తులారాశి ఆరవ ఇంట్లో నక్షత్రం మారబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆదాయ వనరులతో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.

వృశ్చికరాశి:
రాహువు, శని స్థానం నీకు శుభప్రదం. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అంతే కాకుండా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధం విషయంలో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపట్ల కాస్త జాగ్రత్త అవసరం. వ్యాపారులకు ధనలాభం కలుగుతుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×