Worms In Mysore Bonda: రోజురోజుకి హోటల్ యజమానుల నిర్లక్ష్యం పెరిగిపోతుంది. కస్టమర్ల ఆరోగ్యం మీద దృష్టే లేదు. డబ్బులు వస్తే చాలు.. తిన్న వాళ్లు ఏమైపోయిన పర్లేదంటూ వ్యవహరిస్తున్నాయి కొన్ని హోటల్స్. ఇప్పుడు ఏకంగా పురుగులు, బొద్దింకలు వస్తున్నాయి. అందరూ ఎంతో ఇష్టంగా తినే మైసూరు బొండాలోనూ పురుగులు వచ్చాయి.
బండ్లగూడలోని అజంతా కేఫ్ నిర్వాకం.. మైసూర్ బోండాలో పురుగులు..
హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్లో.. ఓ హోటల్ ఏకంగా పురుగులు ఉన్న బొండాలను కస్టమర్లకు సరఫరా చేసింది. రోజు లాగానే స్థానిక వ్యక్తి నితిన్.. ఇవాళ కూడా టిఫిన్ తీసుకోడానికి.. హిమగిరి నగర్ కాలనీలో ఉన్న అజంతా కేఫ్‌కు వెళ్లి.. ప్లేట్ బొండాన పార్శిల్ చేయించుకున్నారు.
టిఫిన్ తినే సమయంలో దర్శన మిచ్చిన పురుగు..
ఇంట్లో తినే సమయంలో బొండాలో పురుగు కనిపించడంతో ఆందోళన చెందాడు. ఇదే విషయాన్ని హోటల్ యజమానికి చెప్పగా.. నిర్లక్ష్యంతో సమాదానం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కస్టమర్.. కార్పొరేషన్ అధికారులకు పిర్యాదు చేశారు. వెంటనే స్పందించి సదరు అజంతా హోటల్ యజమానికి 10వేలు జరిమాన విధించారు.
Also Read: కవ్వంపల్లి VS రసమయి.. రచ్చ రేపుతున్న మానకొండూరు రాజకీయం
ఈ సందర్భంగా వినియోగదారుడు.. అధికారులు ఎప్పటికప్పుడు హోటల్స్ తనిఖీలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి.. వారిచ్చే కాసులకు కక్కుర్తి పడి వదిలేయవద్దని కోరారు. ఎవరైనా హోటల్లో భోజనం చేసేటప్పుడు క్షుణంగా పరిశీలించి తినాలన్నారు.
మైసూర్ బోండాలో పురుగులు
హైదరాబాద్-గంధంగూడ పరిధి హిమగిరినగర్ కాలనీలో ఉన్న అజంతా కేఫ్‌కు వెళ్లి బోండా పార్సిల్ చేయించి ఇంటికి తీసుకువెళ్లిన నితిన్ అనే కస్టమర్
టిఫిన్ తినే సమయంలో బోండాలో దర్శనమిచ్చిన పురుగులు
ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హోటల్ యాజమాన్యం
దీంతో… pic.twitter.com/oQwA26lDTP
— BIG TV Breaking News (@bigtvtelugu) October 19, 2025