Raksha Bandhan: మన భారతీయ సంస్కృతిలో అన్నీ పండుగలూ ప్రత్యేకమే, కానీ రాఖీ పండుగ అంటే మాత్రం అన్నా చెల్లెల అనుబంధాన్ని గుర్తుచేసే పండుగ. అన్నా తమ్ముళ్లకు–చెల్లెల్ల మధ్య ఉన్న ప్రేమను, అనుబంధాన్ని ప్రతిబింబించే రక్షాబంధన్ రోజున, చెల్లెలు తమ్ముడికి రాఖీ కడుతుంది. ఈ రోజు తమ్ముడి దీర్ఘాయువు, ఆనందం, ఆరోగ్యం కోసం చెల్లెలు ప్రార్థిస్తుంది. రక్షాబంధన్ రోజు చెల్లెలు తన అన్నా తమ్ముళ్లకి రాఖీ కట్టి, అతని జీవితంలో ఆరోగ్యం, ఆనందం, విజయాల కోసం ప్రార్థిస్తుంది.
ఈ సందర్భంలో మన పూర్వీకులు చెప్పిన జ్యోతిష శాస్త్రాన్ని క్షణక్షణం మనం గమనిస్తుంటాం. మన జన్మరాశి ప్రకారం వర్ణాలు, దిశలు, దినాలు శుభదాయకంగా ఉంటాయని మన పెద్దలు నమ్మేవారు. ఇక ఇదే పండుగకు సంబంధించి జ్యోతిష్య శాస్త్రం కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది. మన ప్రతి ఒక్కరికీ జన్మరాశి ఉంటుంది. ఆ రాశికి అనుగుణంగా కొన్ని రంగులు శుభప్రదంగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అలాంటి రంగుల రాఖీలు కడితే, అదృష్టం, శ్రేయస్సు అన్నా తమ్ముళ్లకు ఈ ఏడాదంతా లభిస్తుందని నమ్మకం. ఇప్పుడు మనం ఒక్కో రాశికి అనుగుణంగా ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసుకుందాం.
రాశుల వారీగా రాఖీ రంగులు
మేషం (Aries):
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఈ రాశికి అధిపతి మంగళుడు కావడం వల్ల ఎరుపు రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. చెల్లెలు ఎరుపు రాఖీ కడితే, అన్నా తమ్ముళ్లకు ఉత్సాహం రెట్టింపవుతుంది.
వృషభం (Taurus):
వీరు శాంతియుతంగా, స్థిరంగా ఉండే స్వభావం కలవారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరికి తెలుపు రంగు రాఖీ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతతనూ, ప్రేమనూ పెంపొందిస్తుంది.
మిథునం (Gemini):
చురుకైన, చక్కటి సంభాషణకారులు వీరు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఆకుపచ్చ రంగు వీరికి సరిపోయే శుభరంగం. ఇది వారికి స్థిరతనూ, చురుకుతనాన్నీ ఇస్తుంది.
కర్కాటకం (Cancer):
ఇమోషనల్‌గా ఉండే ఈ రాశివారికి తెలుపు లేదా క్రీమ్ రంగు రాఖీలు మంచివి. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావడం వల్ల, శాంతిని సూచించే రంగులే శుభప్రదంగా ఉంటాయి.
సింహం (Leo):
ధైర్యశాలి, నాయకత్వ లక్షణాలు కలవారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే వీరికి బంగారు లేదా పసుపు రంగు రాఖీ ఎంతో శుభప్రదం. ఇది వారి వ్యక్తిత్వాన్ని మెరిపిస్తుంది.
కన్య (Virgo):
సున్నితమైన, పలు విషయాల పట్ల శ్రద్ధ చూపే వీరికి ఆకుపచ్చ రంగు రాఖీ మంచిది. ఇది మానసిక స్పష్టతనూ, సానుకూలతనూ పెంచుతుంది.
తుల (Libra):
సమతుల్యత కోసం ప్రయత్నించే వీరికి అధిపతి శుక్రుడు. తెలుపు రంగు వీరికి శ్రేయస్కరం. శాంతిని తీసుకువస్తుంది.
వృశ్చికం (Scorpio):
వీరిలో అంకితభావం ఎక్కువ. వీరికి ఎరుపు లేదా గులాబీ రంగు రాఖీ చాల శుభప్రదంగా ఉంటుంది. ఇది సానుకూల శక్తిని అందిస్తుంది.
ధనుస్సు (Sagittarius):
ఆవేశపరులైన, ఆధ్యాత్మికత ఉన్న వీరికి పసుపు రంగు రాఖీ మంచిది. ఇది మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది.
మకరం (Capricorn):
వీరు క్రమశిక్షణ, కృషి మీద నమ్మకం కలవారు. వీరికి నీలం రంగు చాలా శుభం. ఇది విజయాన్ని, లక్ష్యసాధనను సూచిస్తుంది.
కుంభం (Aquarius):
ఆలోచనలలో ఆధునికత, కొత్తదనం ఎక్కువ. వీరికి ఊదా లేదా నీలం రంగు రాఖీలు మంచివి. ఇది వారి సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది.
మీనం (Pisces):
భావోద్వేగానికి లోనయ్యే వీరికి పసుపు రంగు రాఖీ మంచిది. ఇది మానసిక స్థిరత్వాన్ని, శాంతిని అందిస్తుంది.
ఈ రాఖీ పండుగన, ప్రతి చెల్లెలు అన్న తమ్ముళ్లకు రాశి తెలుసుకుని, ఆ రాశికి అనుగుణంగా రంగు ఎంపిక చేస్తే, అది ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ మాత్రమే కాదు.. జ్యోతిష్య శాస్త్రాన్ని కూడ నమ్మే వారు దానికి శక్తివంతమైన ప్రయోజనం కూడా కల్పించగలుగుతారు. మరి మీరు మీ అన్న తమ్ముళ్ల రాశిని తెలుసుకొని, ఆ రంగు రాఖీ సిద్ధం చేసారా?