IND Vs ENG : భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండో రోజు ఆటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత వైస్ కెప్టెన్ కేెఎల్ రాహుల్.. శ్రీలంక కి చెందిన ఫీల్డ్ అంఫైర్ కుమార్ ధర్మసేన మధ్య గ్రౌండ్ లోనే తీవ్ర వివాదం చోటు చేసుకుంది. తన సహచన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు రాహుల్. అంపైర్ తో నేరుగా వాగ్వాదానికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా 22వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ.. ఇంగ్లాడ్ బ్యాటర్ జో రూట్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Also Read : IND VS ENG, 5Th Test: ఫస్ట్ ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఇంగ్లాండ్…రెండో రోజు హైలైట్స్ ఇవే
మైదానంలో మాటల యుద్ధం
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంఫైర్లు కుమార ధర్మసేన, అహసాన్ రజా కల్పించుకొని ఇరు వర్గాలను శాంత పరిచే ప్రయత్నం చేసారు. అంఫైర్ల జోక్యం పై కేఎల్ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. నేరుగా ధర్మసేన వద్దకు వెళ్లి.. ఏంటి మమ్మల్ని నిశ్శబ్దంగా ఉండమంటారా..? అని ప్రశ్నించాడు రాహుల్. రాహుల్ తీరు పై ధర్మసేన తీవ్రంగా స్పందించారు. ” ఏ బౌలర్ అయినా నీ దగ్గరకు వచ్చి అలా మాట్లాడితే నీకు నచ్చుతుందా..? రాహుల్, మనం ఆ మార్గంలో వెళ్లకూడదు” అని సున్నితంగా హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గని రాహుల్.. ” మరి మేము ఏమి చేయాలి..? కేవలం బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లిపోవాలా..?” అని ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన ధర్మసేన.. “నాతో అలా మాట్లాడకూడదు” అని గట్టిగా అరిచారు. అంతేకాదు.. మ్యాచ్ ముగిసిన తరువాత వచ్చి తనను కలవాలని రాహుల్ ని ఆదేశించినట్టు సమాచారం.
ఐసీసీ రాహుల్ పై చర్యలు తీసుకుంటుందా..?
మరోవైపు ఇటీవల ధర్మసేన చేసిన విధానం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్ జట్టు కి లబ్ది చేకూర్చే విధంగా ఫీల్డ్ అంఫైర్ కుమార ధర్మసేన వ్యవహరించాడంటూ నెటిఝన్లు మండిపడుతున్నారు. టంగ్ విసిరిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ రెండో బంతి సుదర్శన్ ప్యాడ్ ను తాకింది. ఎల్బీ కోసం ఇంగ్లాండ్ అప్పీల్ చేసినా.. ధర్మసేన తోసిపుచ్చాడు. అంతవరకు ఆగకుండా బంతి ప్యాడ్ కి తాకే ముందు బ్యాట్ కు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుందంటూ వేళ్ల ద్వారా సూచించాడు. దీంతో ఇంగ్లాండ్ రివ్యూ కి వెళ్లే ఆలోచనను విరమించుకుంది. ఇలా ఆతిథ్య జట్టుకు ధర్మసేన ఓ రివ్యూ మిగిల్చేందుకు సహకరించాడని తప్పుడు బడుతున్నారు నెటిజన్లు. మరోవైపు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మైదానంలో ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కింది. ఆటగాళ్లు, అంఫైర్ల మధ్య సంబంధాల పరిమితులపై ఈ వివాదం కొత్త చర్చకు దారి తీసింది. ఈ విషయం పై ఐసీసీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా..? లేదా అనేది వేచి చూడాలి.
KL Rahul to Umpire Kumar Dharmasena:
"What do you want us to do, keep quiet?
"What do you want us to do, bat bowl and go home? #ENGvIND pic.twitter.com/FOwO9Hio35— Nibraz Ramzan (@nibraz88cricket) August 1, 2025