Udaya Bhanu: యాంకర్ ఉదయభాను ( Udaya Bhanu)..ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు యాంకర్ గా ఎన్నో షోలు సక్సెస్ఫుల్ గా చేసి పాపులర్ అయిపోయిన ఉదయభాను.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అంత యాక్టివ్ గా లేదని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఉదయభాను తాజాగా ఓ సినిమాలో మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం ఉదయభాను చేసిన పాట నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ ఉదయభాను ఏ సినిమాలో మాస్ స్టెప్పులు వేసింది అనేది చూద్దాం..
మాస్ స్టెప్పులతో అదరగొట్టేసిన ఉదయభాను..
చాలా రోజుల తర్వాత ఉదయభాను మళ్ళీ తన మాస్ ఎంట్రీతో కం బ్యాక్ ఇచ్చింది. సత్యరాజ్ (Sathya Raj)కీలక పాత్రలో నటిస్తున్న తాజా మూవీ త్రిబాణధారి బార్బరిక్(Tribanadhari Barbarik).. మోహన్ శ్రీవత్స(Mohan Srivatsa) దర్శకత్వంలో వస్తున్న త్రిబాణధారి బార్బరిక్ మూవీలో యాంకర్ ఉదయభాను ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట. తాజాగా ఉదయభాను త్రిబాణధారి బార్బరిక్ మూవీలో చేసిన మాస్ సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఉదయభాను తన మాస్ స్టెప్పులతో అందరితో అదరహో అనిపించడమే కాదు ఏజ్ (52) పెరిగినా కూడా తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది.
ఈ వయసులో కూడా పూర్తి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్..
ఇక ఈ పాటలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Singer Rahul Sipligunj)కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉదయభాను మాస్ స్టెప్పులు వేసిన త్రిబాణధారి బార్బరిక్ మూవీలోని పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో లేడీ డాన్ పాత్రలో ఉదయభాను కనిపించబోతున్నట్టు ఈ పాట చూస్తే అర్థమవుతుంది.
అవకాశాలు లేకుండా చేశారంటూ బాధపడ్డ ఉదయభాను..
ఇక ఉదయభాను కెరీర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ యాంకర్ గా ఉన్న ఈమెని చాలామంది అవకాశాలు రాకుండా తొక్కేసారని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. అంతేకాదు రేపు ఈవెంట్ ఉంది అని చెప్పిన వాళ్ళే ఉదయానికి ఆమెను మార్చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారని ఇలా చాలాసార్లు జరిగింది అని, ఇండస్ట్రీలో కొంతమంది కావాలనే నన్ను తొక్కేస్తున్నారు అంటూ వాపోయింది.
హిట్ అయితే కెరియర్ గాడిన పడినట్టే..
ఇక రీసెంట్ గా సుహాస్(Suhas) నటించిన ‘ఉప్పు కప్పురంబు’ (Uppukappurambu) సినిమా ఈవెంట్ కి హోస్టుగా చేసిన ఉదయభాను తాజాగా త్రిబాణదధారి బార్బరిక్ మూవీతో ఇండస్ట్రీలో యాక్టివ్ అయిపోయింది. మరి ఈ సినిమాతో ఉదయభానుకు లక్ కలిసి వస్తుందా..? మళ్లీ టాలీవుడ్ లో యాక్టివ్ అయిపోతుందా.. ? ఉదయ భానుకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు ఇస్తారా? అనేది చూడాలి. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ఈమె కెరియర్ గాడిన పడినట్టే అని చెప్పవచ్చు.
ALSO READ:Anchor Anasuya: చె** తెగుద్ది.. మరోసారి రెచ్చిపోయిన అనసూయ.. అసలేం జరిగిందంటే?