BigTV English

Klin Kaara : క్లీం కారీ అంటే అర్థం ఇదే

Klin Kaara : క్లీం కారీ అంటే అర్థం ఇదే
Klin Kaara


Klin Kaara : రాంచరణ్, ఉపసాన దంపతులకి పెట్టిన ఆడబిడ్డకు పెట్టిన క్లీం కారీ పేరు వెనుక ఎంతో అర్థం ఉంది. శ్రీ లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 1000 పేర్లు ఉండగా..అందులో 622 నామంరు క్లీంకారీ. శ్రీ లలితా సహస్రనామాల్లో 122వ శ్లోకంలో ఈ పేరు ప్రస్తావన ఉంది. క్లీం అంటే ఆకర్షణీయమైనది అని క్లీంకారీ అంటే ఆకర్షణీయమైన శక్తి ఉన్న అమ్మవారని అర్థం. ఆకర్షణశక్తి అంటే చిన్న విషయం కాదు. ఈ విశ్వమంతా ఆకర్షణా శక్తి మీద ఆధారపడి ఉన్న సంగతి శాస్త్రీయంగాను కూడా రుజువైన విషయం. సృష్టిలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. సూర్యమండలం, నక్షత్ర మండలం ఇవన్నీ ఆకర్షణశక్తి ఆధారంగానే పనిచేస్తున్నాయి.. గ్రహ వ్యవస్థ కూడా ఇదేశక్తితో పనిచేస్తుంది. గ్రహాలన్నీ అలా గట్టిగా పట్టుకుని తిరుగుతున్నట్టు కనిపించడానికి కారణం కూడా ఆకర్షణా శక్తే.

తామర పువ్వును చూసినప్పుడు అందులో ఉండే రేకులు విడివిడిగానే ఉంటాయి. మధ్యలోనే ఉండే దుద్దును కేంద్రంగానే చేసుకునే రేకులు ఉంటాయి . ఆ దుద్దు చుట్టూ ఉన్న ఆకర్షణా శక్తి వల్లే రేకులు పట్టుకుని నిలబడతాయి. ఆ పుష్పం మాదిరిగానే సృష్టిలో అన్ని వ్యవస్థలు ఆకర్షణ శక్తిపైనే పనిచేస్తున్నాయి. ఆ ఆకర్షణాశక్తిలో క్లీంకారా అని పిలుస్తారు. కొంతమంది ఇదంతా గ్రావిటేషన్ పవర్ వల్లే సూర్యమండల వ్యవస్థలు, గ్రహ వ్యవస్థలను పనిచేస్తున్నాయని చెబుతుంటారు. మరి అలాంటి పవర్ ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు. సృష్టి మూలానికి దారితీసిన ఆకర్షణ శక్తి ఎవరిది…ఎక్కడ మొదలైంది..ఎప్పుడు అంతమవుతుంది అంటే ఎవరైనా చెప్పగలరా…?


విశ్వంలోని ఒక శక్తి పుట్టడం వల్లే ఇదంతా నడుస్తుందని ఆధ్యాత్మికంగా ఎప్పుడో చెప్పారు. ఏశక్తి వల్ల అవన్నీ ఆకర్షితమవుతున్నాయో దానినే క్లీంకారీ అంటారు. ఆశక్తిని మనం అమ్మవారుగా పిలుస్తూ నామజపంతో పూజిస్తూ ఉంటాము. కృష్ణుడు బీజ మంత్రం కూడా క్లీంతోనే మొదలవుతుంది. కృష్ణ శక్తి ఆకర్ష్షించేది అని అర్థం. అందుకే శ్రీకృష్ణుడు చుట్టూ గోపికలు, పక్షులు, పశువులు ఇలా అందరూ ఆకర్షించబడి ఆయన చుట్టూ తిరిగే వారు. అలాగే ప్రతీ మంత్రంలను క్లీం అనే పదం వస్తుంది. ఈ పదాన్ని ఎలా పడితే అలా పలకకూడదు. క్లీంకారీ అనేది అమ్మవారి నామం కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు..

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×