BigTV English
Advertisement

Idana Mata Temple: అగ్నిదేవతని ఒక్కసారి పూజిస్తే…

Idana Mata Temple: అగ్నిదేవతని ఒక్కసారి పూజిస్తే…

Idana Mata Temple: చారిత్రక మూలాలు ఉన్న ఆలయాలు రాజస్థాన్ లో ఎన్నో ఉన్నాయి. ఆరావళి పర్వతాల దగ్గరున్న ఇదానా ఆలయానికి ఆ కేటగిరికి చెందినదే. బంబోరాలోని దేవత అగ్నితో స్నానం చేయడం విశేషం. ఎన్నో రహస్యాలకు ఇదానా ఆలయం కేరాఫ్ అడ్రస్ ఎలాంటి పైకప్పు లేకుండా ఆలయాన్ని నిర్మించారు . ఉదయ్ పూర్ కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదానా గుడి. అగ్నిని నీళ్లుగా తీసుకుంటుంది అమ్మవారు. ఈ మహిమ అన్ని రోజులూ కనిపించదు. నెలకి మూడు మార్లు మాత్రమే అగ్నిలో స్నానం చేస్తూ దర్శనం ఇస్తుంది. ఏ కారణం లేకుండానే మంట దానంతటే అదే మండటం ఒక విచిత్రమే. ఆ సమయంలో అమ్మవారి విగ్రహం తప్ప అన్ని వస్తువులు అగ్నికి ఆహుతి కావడం విశేషం.


నెలకి మూడు సార్లు మాత్రమే జరిగే అగ్ని స్నానాన్ని చూసేందుకు భక్తులు ఇక్కడకి విశేషంగా తరలివస్తుంటారు. మంటలు ఇలా ఎందుకు వస్తాయన్నదానిపై పరిశోధకులు అణువణువు పరిశోధనలు చేసినా ఏమీ తేల్చలేకపోయారు. మంట ఎందుకు పుడుతుంది..ఎలా ఆరుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయాయి. ఆలయంలో మంటలు రేగినప్పుడు అమ్మవారి అలంకరణ మాత్రమే కాలిపోయి మిగిలినది యథాతథంగా ఎలా ఉంటుందోనన్న మిస్టరీ అలాగే ఉంది. ఈ మంటల్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఇది అమ్మవారి మహిమేనంటారు. ఇదానా అమ్మవారు అగ్నితో స్నానం చేస్తుందని నమ్ముతుంటారు. ఆలయంలో మంట వచ్చే సమయంలో అవి 10 నుంచి 15 అడుగుల వరకు పైకి లేస్తాయంటారు. జ్వాలారూపంలో అమ్మవారు ఆవహించారని విశ్వసిస్తుంటారు.

ఇదానా మాత అగ్నిరూపాన్ని చూసే భాగ్యం కొందరికి మాత్రమే కలుగుతుందంటారు. ఈ అగ్నిదేవత దగ్గరున్న త్రిశూలాన్ని పూజిస్తే సంతాన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పక్షవాతం లాంటి సమస్యలు బాధపడేవారు ఇక్కడకి వచ్చి అమ్మవారిని దర్శిస్తే పాపం తొలగి మళ్లీ ఆరోగ్యవంతులవుతారని అంటారు. ఈ ఆలయం ఉదయ్ పూర్ మేవాల్ మహారాణి పేరుపైనే ఉంది. మాములుగా ఆలయాల్లో భక్తుల్ని దర్శనాలికి కొన్ని సమయాలు వరకే అనుమతిస్తారు. ఇదానా గుడిలో మాత్రం 24 గంటలు అనుమతిస్తారు. ఎవరైనా ఎప్పుడైనా ఈ దేవతను దర్శించుకోవచ్చు. అమ్మవారిని నిప్పుల స్నానాన్ని కళ్లారా దర్శించుకుని కోరుకున్న కోరికల నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×