రాముడి భక్తుడు ఆంజనేయుడు, అంజనీ పుత్రుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతడు దేవుడు కాకముందే పరమ భక్తుడు. అతని భక్తి, నిజాయితీ, అంకితభావం రామాయణంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన జీవితాన్ని రాముడు, లక్ష్మణుడు, సీతకే అర్పించాడు. లక్ష్మణుడిని కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. లంకను తగులబెట్టి రావణుడికి సవాలు విసిరాడు. హనుమంతుడు తన ప్రభువైన రాముడి కోసం ఏమైనా చేస్తాడు.
హనుమంతుడు చిరంజీవి. అంటే ఆయనకి ఎప్పటికీ మరణం ఉండదు. ఇప్పటికీ మంచు పర్వతాల్లో ఎక్కడో దగ్గర ఉన్నాడనే నమ్ముతారు. రాముడే స్వయంగా ఆయనను ఆశీర్వదించి చిరంజీవిగా చేశాడని అంటారు. అతడు మనిషి ప్రార్థనలను, విన్నపాలను, పిలుపులను వింటాడని… వారిని కాపాడతారని చెబుతారు. ఎందుకంటే హనుమంతుడు భూమి పైన జీవిస్తున్నాడని ఎంతో మంది నమ్మకం.
హనుమాన్ చాలీసా
భయంగా, ఆందోళనగా అనిపించినప్పుడు శక్తివంతమైన హనుమాన్ మంత్రాలను చదవడం ద్వారా ధైర్యాన్ని పొందవచ్చు అని అంటారు. హనుమంతుడికి అంకితం చేసిన మంత్రాలలో హనుమాన్ చాలీసా ఒకటి. తులసీదాస్ రాసిన దీనిలో 40 శ్లోకాలు ఉంటాయి. ఇవి చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ చదవడం ఎంతో ముఖ్యం.
హనుమాన్ చాలీసాను జపించడం వల్ల ప్రజల్లో భయం, ఆందోళన, ప్రతికూలత వంటివి తగ్గిపోతాయి. హనుమాన్ చాలీసాను మీరు భయంలో ఉన్నప్పుడు పదకొండుసార్లు పఠించండి. ఇది మీలో ధైర్యాన్ని నింపుతుంది.
భజరంగ బాన్
హనుమంతుడికి అంకితం చేసిన మరో శక్తివంతమైన మంత్రం భజరంగ్ బాన్. ప్రార్ధనలో ఈ భజరంగ్ మంత్రాలను కొన్ని పఠిస్తే చాలు ఎంతో శక్తి వస్తుంది. అత్యంత ప్రభావవంతమైన ప్రార్థనలో ఇది కూడా ఒకటి. భజరంగ్ బాన్ చదవడం వల్ల జీవితంలోని దుష్టశక్తులను తొలగించడానికి సహాయపడతాయి. అది మనుషులకు బలాన్ని భరోసాను అందిస్తుంది.
పంచముఖి హనుమాన్ కవచం
పంచముఖి హనుమాన్ కవచం అనేది హనుమంతుని పంచ ముఖాల రూపానికి అంకితం. పంచముఖ ఆంజనేయుడి మంత్రం ఇలా ఉంటుంది. ఇది హనుమంతుని వివిధ ఆయుధాలను కూడా వివరిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసమే ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటారు.
ఇక్కడ చెప్పిన హనుమాన్ చాలీసా, భజరంగ్ మంత్రాల పుస్తకాలు మార్కెట్లలో లభిస్తాయి. ఈ మంత్రాలు ఒక్కోటి జీవితంలో ఎన్నో సమస్యల్ని వదిలించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది అపారమైన శక్తులు కలిగినవి. హనుమాన్ చాలీసా, పంచముఖి హనుమాన్ కవచం, బజరంగ్ బాన్ మంత్రాలు ప్రజల జీవితంలో సుఖం శాంతిని అందిస్తాయి.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం.. ఉగాది తర్వాత ఏం జరగబోతుందంటే ?
హనుమంతుడు హిందూ మతంలో అత్యంత భక్తితో ఆరాధనలు అందుకునే దేవుడు, సీతా రాములకు అంకితమైన భక్తుడిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందువులచేత పూజలు అందుకుంటాడు. పైన చెప్పిన హనుమాన్ మంత్రాలను చదువుతూ ఉండాలి. భక్తి శ్రద్ధలతో వీటిని పఠించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి మంగళవారం హనుమాన్ పూజించడం వల్ల మీకు ఎంత ధైర్యంగా ఉంటుంది. రాముడిని పూజించడం ద్వారా కూడా హనుమంతుడి కరుణను పొందవచ్చు.