Astrological Events In 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2025 ఉగాది తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంఘటనలు జరగనున్నాయి. ప్రస్తుతం మూడవ నెల అంటే మార్చి నెల నడుస్తోంది. ఈ నెల 29న 9 గ్రహాలలో 6 గ్రహాలు మీన రాశిలో ఉంటాయి. ఇది ఈ సంవత్సరంలో అతిపెద్ద రాశి మార్పుగా కూడా పరిగణించబడుతుంది. శని 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీన రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. శని, రాహువుల సంయోగం పిశాచం, గ్రహణ యోగాన్ని సృష్టిస్తుంది.
శని యొక్క ఈ రాశి మార్పు , రాహువు, శనిల సంయోగం మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది దేశంలో, ప్రపంచంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రభావితం చేస్తుంది. 2025 సంవత్సరం గ్రహాల రాజు అయిన అంగారక గ్రహానికి చెందినది. ఇది అనేక పెద్ద సంఘటనలను సూచిస్తుంది.
2025లో శని సంచారానికి ముందు భూకంపం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని మార్చి 29, 2025 శనివారం మీన రాశిలోకి ప్రవేశించాడు. దీనికి ఒక రోజు ముందు.. అంటే మార్చి 28న మయన్మార్‌లో భూకంపం కారణంగా వినాశనం సంభవించింది. భూకంప తీవ్రత దాదాపు 7.7గా నమోదైందని చెబుతున్నారు. నక్షత్ర మండలంలో గ్రహాల గందరగోళం ఫలితంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.
2025లో శని సంచారము వల్ల ప్రమాదం:
అనేక జ్యోతిష్య శాస్త్ర ఆధారిత అంచనాల ప్రకారం.. శని మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం యొక్క మరో దశ ప్రారంభమవుతుంది. ఇందులో రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ దేశాలు పాల్గొనున్నాయి. జ్యోతిషశాస్త్రం ఆధారంగా.. ఉగాది తర్వాత అనేక రంగాలలో యుద్ధం ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. యుద్ధం కోసం కొన్ని దేశాల వారు ఇప్పటికే సన్నద్ధమై ఉన్నాయి. యుద్దం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అలజడి ఏర్పడుతుంది. అంతే కాకుండా ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది.
14 మే 2025న.. దేవగురు బృహస్పతి వృషభ రాశి నుండి బయలుదేరి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ బృహస్పతి సంచారము మొత్తం ప్రపంచానికి పెద్ద ఇబ్బందులను తెస్తుంది. గురు సంచార ప్రభావం కారణంగా.. వాతావరణంలో పెద్ద మార్పులు సంభవిస్తుందని భావిస్తున్నారు. బృహస్పతి సంచారం కారణంగా వాతావరణంలో మార్పులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. అంతే కాకుండా వివిధ రాశులవారిపై కూడా ఆరోగ్య పరంగా ఎక్కువ హాని కలిగిస్తుంది.
Also Read: ఉగాది విశిష్టత, తప్పకుండా పాటించాల్సిన నియమాలు
రాహు సంచారము 2025:
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అంతుచిక్కని గ్రహంగా చెప్పబడే రాహువు మే 18, 2025న సాయంత్రం 5:08 గంటలకు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాహు సంచారము కొత్త అంటువ్యాధిని తీసుకువచ్చే ప్రమాదం ఉంది. గతంలో.. కరోనా వైరస్ చాలా వినాశనాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు మరో ఒక కొత్త రకం అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. రాహువు సంచారం అన్ని గ్రహాలపై దాదాపు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. రాహువు ప్రభావం పడకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతారు.