E-Paper
Advertisement

గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు
Advertisement

Gadwal News: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల జిల్లా కేంద్రంలో పాదచారుల కోసం ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి . అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకుపోతున్నాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేనంతగా మారిపోయాయి.అడ్డుకోవాల్సిన అధికారులు పర్యవేక్షణ చేపట్టి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వాణిజ్య దుకాణాలను తొలగించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారం చేసుకునే వారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది.పట్టణంలో ప్రధాన రోడ్లను ఆక్రమించి యథేచ్ఛగా తాత్కాలిక దుకాణాలు వెలుస్తున్నాయి.

దర్జాగా కబ్జా

గద్వాల,శాంతినగర్ అయిజ మున్సిపాలిటీలకు గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. దీంతో ప్రధాన రహదారులు రద్దీతో రాకపోకలు కొనసాగుతుంటాయి. కొన్ని చోట్ల సెట్ బ్యాక్ లేకుండా షాపింగ్ మాల్స్ సైతం ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల రాకపోకలతో పాటు పాదచారుల సంఖ్య అధికంగా ఉంటుంది. వారికోసం కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు సైతం చిరు వ్యాపారాలు మొదలుకొని బట్టలు దుకాణాలు, పండ్ల దుకాణాలు, సెల్ ఫోన్ షాపులు, వివిధ తిను బండారాల దుకాణాలు తదితర చిన్న చితక వ్యాపారులు ఫుట్పాత్ పైన తిష్ట వేశారు.దీంతో వివిధ పనుల నిమిత్తం పట్టణంలో ప్రధాన రహదారుల గుండా నడవడానికి కూడా స్థలం లేకుండా పోతోంది. ప్రధానంగా వీధి వ్యాపారుల ఆక్రమణలు పెరిగిపోయాయి. వాటి షాప్ ల యజమానులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ గా వాడుకుంటున్నారు. షాపింగ్ సమయాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు సైతం ఫుట్ పాత్ పైన నిలపడంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు,పాదచారులు నానా యాతన పడుతున్నారు.

పెరుగుతున్న రోడ్డు ఆక్రమణలు

Advertisement

పట్టణాల్లో రోజు రోజుకి రోడ్డు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. మురుగు ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజీని సైతం ఆక్రమణదారులు వదలడం లేదు. డ్రైనేజీ మీదే ఏకంగా తాత్కాలిక పండ్ల దుకాణాలు, చికెన్ తయారీ సెంటర్లు కృష్ణవేణి చౌరస్తా సమీపంలోని డ్రైనేజీ మీద ఏర్పాటు చేశారు. జిల్లా ఆజ్ఞాపకరాలయ సమీపంలో సైతం బైక్ మెకానిక్, వెల్డింగ్ కేంద్రాలు వెలిశాయి. గద్వాల తహసీల్దార్ కార్యాలయ పక్కన ప్రధాన రహదారి గుండా ఎన్నడూ లేని విధంగా నెట్ సెంటర్లు వెలుస్తున్నాయి. దీంతో వేలకు వేలు కిరాయిలు భరిస్తూ తాము షాపులను ఎలా నిర్వహించగలమని, కిరాయికి తీసుకొని షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులు వాపోతున్నారు.

Also Read: అరాచకం అంటే ఇదేనా? బన్నీ-అట్లీ మూవీ టైటిల్ లీక్.. ఇన్ని వేషాలు ఎలా గురూ !

రోడ్లపైనే బండ్లను ఆపి..

Advertisement

ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ ఖాలీ స్థలాలు కనిపిస్తే చాలు ఆక్రమిస్తూ కొందరు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ప్రధాన రహదారిపై దర్జాగా రోడ్డుని ఆక్రమించుకొని పళ్ళ దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలు దారులు రోడ్లపైనే బండ్లను ఆపి కొనుగోలు చేస్తున్నడంతో అటుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే పాత దుకాణ సముదాయాలు, ఎల్లప్ప హాస్పిటల్ గుండా ఇరుకు రోడ్డు కావడం దానికి తోడు వాహనాలు రోడ్లపై నిల్పడంతో అటుగా ఒక కారు వెళ్తే మరో కారు క్రాస్ అయ్యే పరిస్థితి ఉండడం లేదు. రాయల్ లాడ్జ్ సమీపంలో సైతం రోడ్డు సమీపంలో కిరాణాల దుకాణాలకు తరచుగా భారీ వాహనాలు అన్ లోడ్ చేస్తుండడంతో పాటు కూరగాయల దుకాణాలు నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఆ మార్గం గుండా రద్దీ నెలకొంటుంది.

చర్యలు తీసుకోవడం శూన్యం

జిల్లా కేంద్రమైనప్పటినుంచి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు అక్రమ దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన ఆక్రమణదారులు భారీగా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకొని కమర్షియల్ దందాకు తెర లేపారు. మరికొందరు వాటిని ఆక్రమించి మరొకరికి కిరాయికి ఇస్తూ ఏం చక్కగా సొమ్ము చేసుకుంటున్నా అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలే వాహనాల సంఖ్య అధికంగా పెరగడం, రోజు రోజుకి రోడ్లు కుంచించుకు పోవడంతో వాహనదారులు,పాదచారుల ఇబ్బందులు పడుతున్నా అక్రమంగా వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, సంబంధిత అధికారుల పనితీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×