BigTV English

Negative Energy: ఈ పరిహారాలు చేయండి చాలు.. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయ్ !

Negative Energy: ఈ పరిహారాలు చేయండి చాలు.. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయ్ !

Negative Energy: ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఓ కళ. ఎంతో డబ్బు ఖర్చు చేసి మరీ ఇళ్లను నిర్మించుకుంటారు. ప్రతి ఒక్కరు సంతోషంగా జీవితం గడపడానికి సొంతిల్లు అవసరం. కానీ ఇంట్లో ప్రతికూల శక్తులు తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఎటు చూసినా ఆర్థిక, కుటుంబ పరమైన సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇంట్లో నెగిటివిటీ ఏర్పడేందుకు మనం చేసిన తప్పులే కారణం. ముఖ్యంగా వాస్తు చిట్కాలు పాటించకపోవడంతో పాటు విరిగిపోయిన పాత వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా ప్రతికూలతలు ఏర్పడతాయి.


ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం. సింపుల్ పరిహారాలు ఇంటి నుంచి నెగటివిటీని తరిమికొడతాయి. నెగటివిటీని తొలగించేందుకు ఖరీదైన వస్తువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం వంట గదిలో దొరికే చిన్న చిన్న వస్తువులు చాలు. మీ తలరాతను మార్చుకునేందుకు ఇవి సహకరిస్తాయి.

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సాధారణమైన మసాలా. ఇంట్లో నెగిటివిటీని బయటకు పంపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంటికి ఓ మూలలో దాల్చిన చెక్క పొడిని చల్లుకోవడం వల్ల ప్రతికూలత నుంచి ఇల్లు దూరంగా ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూల దృష్టిని ఆకర్షిస్తుంది. చేతిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకొని శుద్ధీకరణ కోసం ఇంటి మూలాల్లో కొద్దిగా ఈ పొడిని చల్లుకోవాలి. అలాగే దాల్చిన చెక్క పొగను కూడా ఇల్లు అంతా వ్యాపింప చేయండి.


సేజ్ :
సేజ్ ఆకులను కాల్చడం మరొక సింపుల్ పరిహారం. ప్రతికూల శక్తి నుంచి తొలగించేందుకు ఇది శక్తివంతమైన మార్గం. సెజ్ గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా పరిసరాల నుంచి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. సేజ్ కట్టను తీసుకొని వెలిగించి దాని నుంచి వచ్చే పొగను తలుపులు, కిటికీల మూలాలు, అద్దాలు, ఇంట్లో ప్రతీ ప్రదేశాన్ని విస్తరించేలా చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. తలుపుదగ్గర ఈ మొక్క నాటండి.

రోజ్ మేరీ:
మీ జుట్టుకే కాదు శక్తివంతమైన పరిహారానికి కూడా రోజ్ మేరీ పనిచేస్తుంటుంది. ఇందులో పరిసరాలు శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి. రోజ్ మేరీ కొమ్మలు.. ఆకులు, తలుపుల దగ్గర ఉంచడం వల్ల మీ ఇళ్లు చెడు శక్తుల నుంచి రక్షించబడుతుంది. అంతేకాకుండా గుమ్మం దగ్గర రోజ్‌మేరీ మొక్కను పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రవేశ ద్వారం లేదా బాల్కనీ తలుపులు దగ్గర కూడా దీనిని ఉంచుకోవచ్చు. ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

సౌండ్ క్లెన్సింగ్:
ఇంట్లో సౌండ్ క్లెన్సింగ్ కూడా ప్రతికూల శక్తులను తొలగించేందుకు ఉపయోగించబడుతుంది. ఇందుకోసం ఇంట్లో విండ్ చైమ్స్‌ ను వేలాడదీయవచ్చు. ప్రతికూల శక్తులను ఇవి విచ్ఛిన్నం చేయడంలో ఉపయోగపడతాయి. సానుకూల శక్తుల ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. విండ్ చైమ్స్ నుంచి వచ్చే తరంగాలు సానుకూలతను విస్తరిస్తాయి.

Also Read: ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం, సమస్యలు తప్పవు

కర్పూరం కాల్చడం:
హిందూ ఆచారాలల్లో కర్పూరం తప్పనిసరిగా ఉపయోగించే పదార్థం. ఉదయం వేళ చేసే పూజ దగ్గర నుంచి యాగాల వరకూ ఇది లేనిదే పని జరగదు. పరిసరాలు శుద్ధి చేసే గుణాలు దీనికి ఉంటాయి. ఇంటికి రక్షణ వాతావరణాన్ని ఇస్తాయి. కర్పూరం కాల్చి దాని నుంచి వచ్చే సువాసన పొగ ఇల్లంతావ వ్యాపించేలా చేయడం మంచిది. ఈ పొగ మీ ఇంటి పరిసరాలకు చెందిన ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×