BigTV English

Rules of Wearing Rudraksha: రుద్రాక్ష ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పక పాటించాలి..

Rules of Wearing Rudraksha: రుద్రాక్ష ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పక పాటించాలి..

Rules of Wearing Rudraksha: హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం శ్రావణం. శ్రావణ మాసం శివుని పూజకు చాలా ప్రత్యేకమైనది. భక్తులు ఈ మాసంలో శివుని ఆరాధించడంలో నిమగ్నమై ఉంటారు. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే.. వారిపై శివయ్య అనుగ్రహించి కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తాడని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో రుద్రాక్ష ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ నియమాలు పాటిస్తూ రుద్రాక్షను ధరిస్తే పరమశివుని అపారమైన అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్ష శివునికి అత్యంత ఇష్టమైన ఆభరణంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడానికి ఉండే కొన్ని ప్రత్యేక నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.


రుద్రాక్ష ధరించడానికి పవిత్రమైన రోజు

రుద్రాక్షను శ్రావణ మాసంలో ఎప్పుడైనా ధరించవచ్చు. అయితే సోమవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. నిజానికి, సోమవారాన్ని మహా దేవుడికి అంకితం చేస్తారు. కాబట్టి, ఈ రోజున రుద్రాక్ష ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శివుని ప్రత్యేక పూజల అనంతరం రుద్రాక్షను ధరించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.


అనుకూలమైన సమయం

రుద్రాక్ష ధరించడానికి అత్యంత సరైన సమయం తెల్లవారుజామున అని శాస్త్రం చెబుతుంది. వాస్తవానికి, ఈ సమయంలో మొత్తం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రుద్రాక్షను ధరించడం వల్ల దాని శక్తి సరిగ్గా పని చేస్తుంది.

ప్రత్యేక నియమాలు

శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదనే విషయం తెలిసిందే. ఈ మాసంలో ముందుగా సోమవారం ఉదయం గంగా జలంతో రుద్రాక్షను కడగాలి. అనంతరం శివుడిని పూజించిన తర్వాత, ఓం నమః శివాయ అని జపించేటప్పుడు రుద్రాక్షను ధరిస్తే శివయ్య అనుగ్రహం ఉంటుంది.

ఈ జాగ్రత్తగా పాటించాలి

రుద్రాక్ష ధరించిన తర్వాత, ధ్యానం మరియు సాధన క్రమం తప్పకుండా చేయండి. దీని వలన రుద్రాక్ష శక్తిని పొందుతారు. రుద్రాక్ష ధరించేవారు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ఆహారం మరియు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఏ రుద్రాక్ష మంచి ఫలితాలను ఇస్తుంది

రుద్రాక్ష వివిధ రూపాల్లో లభిస్తుంది. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేక ఉంటుంది. సరైన రుద్రాక్షను ధరించడానికి పండితుల సహాలు తీసుకోవడం మంచిది.

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×