Big Stories

Rules for Coconut to God: దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టే ముందు ఈ విషయం తెలుసుకోండి..!

Rules for Coconut to God: దేవాలయాలకు గానీ, ఏ చిన్న గుడికి వెళ్లినా కూడా భగవంతునికి భక్తులు కొబ్బరికాయ కొడుతుంటారు. దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొడితే కష్టాలన్నీ తొలిగిపోయి సుఖశాంతులతో ఉంటారని భావిస్తుంటారు. అదేవిధంగా శుభకార్యాలయాల సందర్భంగా కూడా మంచి జరుగుతుందని కొబ్బరి కాయలు కొడుతుంటారు.

- Advertisement -

అయితే, కొబ్బరి కాయ కొట్టడానికి కూడా పలు నియమాలుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఆ నియమాలను అనుసరిస్తూ కొబ్బరి కాయ కొడితే వారికి ఖచ్చితంగా అనుకున్న శుభం కలగుతుందని వారు చెబుతున్నారు. అయితే, ఆ నియమాలేంటంటే.. కొబ్బరి కాయను ముందుగా శుభ్రంగా కడగాలి.. ఆ తరువాత ఆ కొబ్బరి కాయను పట్టుకునే విధానంలో నియమం ఉంటుంది.. కొబ్బరికాయను కొట్టే సమయంలో పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకోవాలి.. అదేవిధంగా కొబ్బరికాయను కొట్టే రాయిని ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకుని, కాస్త ఎత్తు నుంచి కొబ్బరి కాయను కొట్టాలని చెబుతున్నారు.

- Advertisement -

అయితే, ఇలా కొబ్బరికాయను కొట్టేముందు కాయకు ఉండే పీచును తీసి కొబ్బరికాయను కొడుతుంటారు.. కానీ, అలా చేయకూడదని.. కొబ్బరికాయను కొట్టిన తరువాతనే ఆ పీచును తీయాలని చెబుతున్నారు. ఎందుకంటే కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులను త్రినేత్రుడి ప్రతిరూపాలని.. కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పిస్తే పరమేశ్వరులవారి కరుణ కటాక్షాలు ఖచ్చితంగా లభిస్తాయని చెబుతున్నారు.

Also Read: ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు వివాహం సాధ్యమేనా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

ఇంకో విషయమేమంటే.. కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో తెల్లటి పువ్వు వచ్చినప్పుడు భక్తులు అత్యంత సంతోషపడుతారన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News