BigTV English

Severe Heat Waves Alert to TS & AP: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అల్లాడుతున్న ప్రజలు!

Severe Heat Waves Alert to TS & AP: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అల్లాడుతున్న ప్రజలు!

Severe Heat Waves Alert Andhra Pradesh and Telangan: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగలే కాదు.. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏసీలు, కూలర్లు ఉన్నవాళ్ల సంగతి సరే. కానీ.. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా లేనట్టే ఉంటోంది. ఆ గాలి కూడా వేడిగానే ఉంటుండటంతో.. ఉక్కపోతకు ప్రజలకు కునుకు పట్టడం లేదు.


ఏపీలో శుక్రవారం నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరులలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే ప్రకాశం జిల్లా అర్థవీడులో 47.3 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.

Also Read: వడదెబ్బతో ఆరుగురు మృతి..! నేడు కూడా రాష్ట్రంలో..


నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఆదివారం 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 273 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పింది. మరోవైపు తెలంగాణలోనూ రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో, జగిత్యాల జిల్లా నేరెళ్లలో, సూర్యాపేట జిల్లా మునగాలలో, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×