BigTV English
Advertisement

Telangana Weather Updates: వడదెబ్బతో ఆరుగురు మృతి.. నేడు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు

Telangana Weather Updates: వడదెబ్బతో ఆరుగురు మృతి.. నేడు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు

Telangana Weather Updates: గత నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 అయ్యిందంటే చాలు ఎండి వేడిమి ప్రారంభమైతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిల, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాలలో కూడా 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా 45 డిగ్రీలకు పైకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.


ఈ అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు కూడా భారీగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఎండలు అటు వడగాలులు వీస్తుండడంతో జనానికి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఆరుగురు వడదెబ్బతో మృతిచెందినట్లు తెలుస్తోంది.

నేడు, రేపు కూడా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. అదేవిధంగా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు కూడా భారీగా వీచే అవకాశం లేకపోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైద్య నిపుణులు కూడా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.


Also Read: Hyderabad Pubs : హైదరాబాద్ పబ్‌లపై టాస్క్ ఫోర్స్ కొరడా.. ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లేవాళ్లు ఎండలు ప్రారంభానికి ముందే ఇంటి నుంచి వెళ్లితే ఎండల నుంచి తప్పించుకునే అవకాశముందని పేర్కొంటున్నారు.

Tags

Related News

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

CM Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్.. అందుకే ఫామ్‌హౌస్‌కి, తారలతో తిరిగే కల్చర్ ఎవరిది?

Big Stories

×