E-Paper
Advertisement

Rush In Shabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికే అన్ని గంటలు

Rush In Shabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికే అన్ని గంటలు
Advertisement

Rush In Shabarimala: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉద‌యం నుండి భారీగా భ‌క్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వేలాది సంఖ్యలో తరలిరావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మారుమోగిపోతుంది. దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబ‌ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. మండల పూజలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ వారికోసం సహాయక చర్యలను చేపట్టింది.

Also Read: కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ కొడుకు

Advertisement

భక్తులను క్యూ లైన్ లో వెళ్లే విధంగా సిబ్బంది చూస్తున్నారు. అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర సాయం కోసం మెడిక‌ల్ క్లినిక్ లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా కమిటీ దర్శనాన్ని కల్పిస్తోంది. అయినా బక్తులు తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈనెల పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×