E-Paper
Advertisement

Saturn Transit Horoscope : శనిదేవుడి ఆశీస్సులు.. ఈ మూడు రాశులవారికి 87 రోజులు పట్టిందల్లా బంగారమే

Saturn Transit Horoscope : శనిదేవుడి ఆశీస్సులు.. ఈ మూడు రాశులవారికి 87 రోజులు పట్టిందల్లా బంగారమే
Advertisement

Saturn Transit Horoscope : మనిషిగా పుట్టిన ఎవరి జీవితం బాగుండాలన్నా శని దృష్టి బాగుండాలి. దీనిని హిందువులు బలంగా నమ్ముతారు. జాతకంలో శని చెడు ప్రభావం చూపితే.. అన్నీ నష్టాలే జరుగుతాయని, శుభకార్యాలకు ఆటంకం ఉంటుందని, ఉద్యోగాలు రావడం కూడా కష్టమేనని భావిస్తారు. అదే శని ఉచ్ఛస్థితిలో ఉంటే.. వారంత అదృష్టవంతులుండరు. రాబోయే రోజుల్లో శని చలనం మారుతుండటంతో.. కొన్ని రాశుల వారికి 87 రోజుల పాటు అన్నీ మంచి ఫలితాలే కలుగనున్నాయి.

అయితే ఈసారి శని రాశి మారడమే కాదు.. నక్షత్రం కూడా మారుతున్నాడు. ఆగస్టు 18న శని వ్యతిరేక దిశలో కదులుతాడు. అక్టోబర్ 3న శనిదేవుడు శతభిషా నక్షత్రంలో నాల్గవ స్థానంలోకి ప్రవేశిస్తాడు. పూర్వభాద్ర నక్షత్రాన్ని గురువు, శతభిషా నక్షత్రాన్ని రాహువు పరిపాలిస్తారు. అలాంటి స్థితిలో శని స్థానం మారుతుండటంతో మూడు రాశులవారి జీవితాలు మారనున్నాయి.

Advertisement

Also Read : వృషభరాశిలోకి కుజుడి ప్రవేశం.. ఈ ఐదు రాశులవారికి ఊహించని ప్రయోజనాలు

వృశ్చిక రాశి

Advertisement

శని స్థానం మారుతుండటం ఈ రాశివారికి శుభప్రదం కానుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్తల్ని వింటారు. వ్యాపారులకు మంచికాలం.

కన్య రాశి

శని రాశి మార్పు వల్ల ఈ రాశివారు లాభపడతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. స్తిరాస్థిలో పెట్టిన పాత పెట్టుబడి.. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు అధికం కావొచ్చు. కానీ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి

ఈ రాశివారికి కూడా శని స్థానం మంచి ఫలితాలను ఇవ్వనుంది. మీ కుటుంబం, పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతారు. శని అనుగ్రహంతో సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నగదు సంబంధిత సమస్యలు క్రమంగా తొలగుతాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×