Cheapest Bikes In India: భారతదేశంలో చాలా మంది ప్రజలు తక్కుద ధరలో లభించే వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. వీటిలో బైక్‌లు కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో చౌకైన బైక్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తక్కువ ధర, అధిక మైలేజీ కారణంగా ప్రజలు ఈ బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్ బైకులను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత మైలేజీని అందించే బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Hero HF 100
హీరోకి చెందిన ఈ బైక్ దేశంలోనే అత్యంత చవకైన బైక్‌లలో ఒకటి. ఈ బైక్‌లో 97.2 సిసి ఇంజన్ ఉంది. ఇది 8.02 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,018.
Also Read: వివో నుంచి రెండు ఫోన్లు.. తక్కువ ధరకే లాంచ్..!
Hero HF Deluxe
భారతదేశంలోని చౌకైన బైక్‌లలో రెండవ స్థానంలో హీరో కంపెనీకి చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఉంది. ఈ బైక్‌లో 97.2 cc ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 8.02 bhp పవర్, 8.05 Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. Hero HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.59,998.
Bajaj CT 100
ఈ జాబితాలో మూడో స్థానంలో బజాజ్ CT 100 ఉంది. ఈ బైక్‌లో 99.27 cc ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7.79 bhp పవర్‌ని, 8.34 Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో లీటరుకు 75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బజాజ్ CT 100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 62,265.
Bajaj Platina 100
బజాజ్ ఈ బైక్ చౌకైన ధరలో మంచి మైలేజీని ఇచ్చే బైకుల్లో ఒకటి. ఈ బైక్‌లో 102 cc ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7.79 bhp పవర్, 8.34 Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ మైలేజీ గురించి చెప్పాలంటే ఇది ఒక లీటర్ పెట్రోల్‌లో 72 kmpl వరకు నడుస్తుంది. బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర రూ.68,262.
Also Read: రూ. 14 వేల ఫోన్‌పై భారీ ఆఫర్.. 5G స్మార్ట్‌ఫోన్.. చీప్‌గా కొట్టేయండి!
TVS Sports
ఈ టీవీఎస్ బైక్ దేశంలోనే అత్యంత చవకైన బైక్‌లలో ఒకటి. ఈ బైక్‌లో 109.7 cc ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 8.19 PS పవర్‌ని, 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టీవీఎస్ స్పోర్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.59,881.