BigTV English

Sensational Comments: ‘మా’కు లేఖ, హేమ సంచలన వ్యాఖ్యలు…

Sensational Comments: ‘మా’కు లేఖ, హేమ సంచలన వ్యాఖ్యలు…

Actress Hema Gives Letter To Maa President Vishnu: గత రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెన్సేషనల్‌గా మారింది.ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు కర్నాటక పోలీసులు ప్రకటించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.ఆమె డ్రగ్స్ సేవించిందని,టెస్ట్ రిపోర్ట్‌లో పాజిటివ్ వచ్చిందంటూ ఆ రాష్ట్ర పోలీసులు హేమకి నోటీసులు జారీ చేశారు.ఆ తర్వాత విచారణకు వచ్చిన హేమని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మధ్యనే ఆమె బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చింది.అయితే పోలీసులు హేమని అరెస్టు చేసిన తరువాత..ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మా అసోసియేషన్ హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది.


అయితే ఇదే విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.ఈ నేపథ్యంలో నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంచలన లేఖ రాసింది.అంతేకాదు మా అధ్యక్షుడు మంచు విష్ణును స్వయంగా కలిసి ఆ లెటర్‌ని అందజేసింది.దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్‌కు సంబంధించి తన రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేసింది హేమ.నేను సుమారు దశాబ్దకాలంగా మా అసోసియేషన్‌లో సభ్యురాలిగా ఉన్నాను.అలాంటిది తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కనీసం వివరణ అడగకుండా మా సభ్యత్వం నుంచి నన్ను తొలగించడం అన్యాయం అని ఆమె అన్నారు.బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంలో నాపై దుష్ప్రచారం జరిగింది.ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది.

Also Read: కమల్‌కి షాక్ ఇచ్చిన బ్రహ్మానందం


మా రూల్స్‌ ప్రకారం ముందుగా నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి.కానీ అటువంటిదేమీ జరగలేదు.షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సరైంది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరారు.కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా మా నుంచి నన్ను తీసెయ్యడం చాలా తప్పంటూ పేర్కొంది. ఇటీవల డ్రగ్స్ టెస్ట్‌లో నాకు నెగిటివ్ వచ్చింది.త్వరలోనే‌ పోలీసులు జరిపిన పరీక్షల వివరాలన్నీ కూడా బయటకొస్తాయి.అందుకని మళ్లీ మాలో నా సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని కోరారు.ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు మా సపోర్ట్ కావాలని లేఖలో పేర్కొంది.కాగా హేమ‌ లేఖను తీసుకున్న మంచు విష్ణు అడ్వైజరీ కమిటీకి ఆ లెటర్‌ని పంపిస్తామని, ఆ తరువాత మా కమిటీలో చర్చించి ఒక డెసీషన్‌ తీసుకుంటామని హేమకు విష్ణు తెలిపినట్లు తెలుస్తోంది.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×