BigTV English

Benefits Of Vasakommu : వసకొమ్ముతో ఏడు లాభాలు

Benefits Of Vasakommu : వసకొమ్ముతో ఏడు లాభాలు
Benefits Of Vasakommu


Benefits Of Vasakommu : వసకొమ్మును చాలా పరిహారాల్లో ఉపయోగిస్తుంటారు. ధనాన్ని ఆకర్షించే వస్తువుగా భావిస్తుంటారు. ముఖ్యంగా తాంత్రిక పరిహారాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వసకొమ్మును ధనాకర్షణతోపాటు ధాన్య ఆకర్షణికి కూడా ఉపయోగిస్తుంటారు. సిరి సంపదల కోసం ఉపయోగించాల్సిన వస్తువుల్లో వసకొమ్ము కూడా ఒకటిగా పెద్దలు చెబుతుంటారు. ఈకొమ్ములని కొన్ని రకాల వస్తువుల కలిపి కడితే ఫలితాలు బాగుంటాయని పరిహార శాస్త్రం చెబుతోంది. వసకొమ్ముతో కలిపి ఉంచే వస్తువులను అది తన వశం చేసుకుంటుందట. ముఖ్యంగా పేదరికంతో బాధపడే వారు వసకొమ్ము ఒక పరిహారంగా ఉపయోగపడుతుంది. అలా వాడేటప్పుడు కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి.

వసకొమ్ము సింహద్వారం పైన , వ్యాపారస్తులైతే దుకాణాలపైన పెట్టుకోవాలి. లాభాలు రావడానికి, దిష్టి తగలకుండా ఉండటానికి, శత్రువుల కళ్లలో పడకుండా ఉండడానికి పెట్టుకోవచ్చు. అలాగే మన నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు వసకొమ్ము పరిహారంగా సహాయపడుతుంది . ఉప్పు, స్పటికతో కలిపి వసకొమ్మును కట్టడం వల్ల మొండిబకాయిల సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది.


అమావాస్యనాడు ఉప్పుతో కలిపి వసకొమ్ముని కలిపి కడితే ఇంటి కళే మారిపోతుంది. డబ్బులు, నగల పెట్టెలో కూడా ఈ వసకొమ్మును పెట్టుకుంటే మంచిది. అంతే కాదు చిన్నపిల్లలకి వసకొమ్మును బొట్టు పెట్టేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. ఇంటి నుంచి పని మీద బయటికి వెళ్లేటప్పుడు వసకొమ్మును కాల్చి దానిపై ఉండే మసిని బొట్టుగా పెట్టుకుని వెళ్తే తిరుగుండదు. అయితే వసకొమ్ము వాడినా ఫలితాలు రాకపోవడానికి కొన్ని తప్పులు కారణం అవుతాయి. వీటిని కొనేటప్పుడు నేరుగా వసకొమ్ములు ఇమ్మని అడగకుండా వేరే రకంగా తీసుకోవాలట.. వీటి పేరు చెప్పకుండా కొంటేనే ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. అందులోను ప్రత్యేకంగా సాయంత్రం చీకటి పడిన తర్వాత అసలు కొనకూడదు. బేరమాడుతూ వీటిని ఎట్టి పరిస్థితుల్లోను కొనకూడదంటారు. వస కొమ్ముల్ని మంగళ, శుక్రవారాల్లో కొంటే మంచిది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×