Shani Rahu Yuti 2025 : న్యాయదేవుడు శని మనిషి అతని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఈ విధంగా వారు అన్ని రాశులను పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. వచ్చే ఏడాది 2025లో శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు గ్రహం ఇప్పటికే మీన రాశిలో ఉంది. అటువంటి పరిస్థితిలో, శని , రాహువుల కలయిక రక్త పిశాచ యోగాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా వినాశకరమైనంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని మార్చి 29, 2025 శనివారం రాత్రి 10:07 గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా చాలా వినాశకరమైన పిశాచ యోగం ఏర్పడనుంది. దీని కారణంగా 3 రాశుల వారికి హాని జరుగుతుంది. ఆ 3 దురదృష్టకర రాశులు ఏవో.. వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యారాశి:
శని, రాహువుల కలయిక వల్ల ఏర్పడే పిశాచ యోగం కన్యా రాశి వారికి చాలా హానికరం. ఈ వ్యక్తుల వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఇంట్లో సమస్యలు కూడా పెరుగుతాయి. అంతే కాకుండా వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు పార్టనర్‌షిప్‌తో చేసిన పనిలో కూగా నష్టాలు వస్తాయి. ఈ సమయంలో మీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. పనులు పెండింగ్ లో పడతాయి. అధికారుల నుంచి ఒత్తిడి కూడా మొదలవుతుంది. ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ప్రయాణాలు చేసే టప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని కష్టాలు వస్తాయి.
మకర రాశి:
మకర రాశి వారు విధ్వంసక పిశాచ యోగం ప్రభావంతో ప్రభావితమవుతారు. అలాంటి వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, బయటి ఆహారాన్ని తినడం మానుకోవాలి. తోబుట్టువులు , పొరుగువారితో సంబంధాలు క్షీణిస్తాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సమస్యలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పనికి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాల పెరుగుతాయి. దగ్గరి బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.
Also Read: సూర్యుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే !
మీన రాశి:
శని, రాహువు కలయిక మీన రాశి వ్యక్తుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాగే, మానసిక ఒత్తిడి కూడా ఈ సమయంలో పెరుగుుతంది. వ్యాపారంలో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అప్పుల కారణంగా ఆందోళన చెందుతారు. కుటుంబ బాధలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఎక్కువ కష్ట పడాల్సి వస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)