Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని ప్రతి మూలకు విస్తరించి ఉంది. ప్రతి రోజూ రెండు నుంచి మూడు కోట్ల మంది ప్రయాణీకులు రైల్వే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించాలంటే, కచ్చితంగా కొన్ని రైల్వే రూల్స్ తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
⦿ రన్నింగ్ ట్రైన్ లో అలారం చైన్ లాగడం
రైలు లోని ప్రతి కోచ్ లో డోర్స్ దగ్గర దగ్గర అత్యవసర అలారం చైన్ ఉంటుంది. అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ చైన్ ను లాగాలి. మెడికల్ ఎమర్జెన్సీ, ప్రయాణీకుల భద్రతకు ముప్పు కలిగినప్పుడు, కోచ్ లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, పిల్లలు, వృద్ధులు, తోటి ప్రయాణీకులు రైల్లోకి ఎక్కక పోయినా చైన్ లాగవచ్చు. సరదాకు అలారం లాగితే ఫైన్ చెల్లించడంతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
⦿ రైల్లోనే టికెట్ తీసుకోవచ్చు
పీక్ సీజన్‌లలో టికెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ దొరక్కపోవచ్చు. ఎక్కడి వరకు టికెట్ దొరికితే అక్కడి తీసుకుని రైలు ఎక్కాలి. TTE దగ్గరికి వెళ్లి దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవాలి. ఉన్న టికెట్ కు కొనసాగింపుగా మరో టికెట్ ఇస్తారు. అయితే, బెర్త్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
⦿ మిడిల్ బెర్త్ రూల్
మిడిల్ బెర్త్ కు సంబంధించి ప్రత్యేకమైన రూల్ ఉంది. పగటిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ మిడిల్ బెర్త్ ను ఓపెన్ చేయకూడదు. ప్రయాణీకులు రాత్రి 10 గంటల నుంచి మాత్రమే మిడిల్ బెర్త్ మీద పడుకోవాలి. ఉదయం 6 గంటల తర్వాత మడిచిపెట్టాలి. కాదని అలాగే ఉంచితే లోయర్ బెర్త్ ప్రయాణీకుడు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
⦿ రెండు స్టాప్‌ల రూల్
అనుకోకుండా రైల్ మిస్ అయితే, టిక్కెట్ కలెక్టర్ వెంటనే ఆ సీటును మరో ప్రయాణీకుడికి ఇవ్వకూడదని రైల్వే రూల్స్ చెప్తున్నాయి. కనీసం రెండు స్టాఫ్ లు దాటిన తర్వాతే వేరొకరికి కేటాయించాలి.
⦿ రాత్రి 10 గంటల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాధారణంగా రాత్రి 10 గంటల తర్వాత తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టీటీఈ కూడా నిర్ణీత సమయానికి ముందే టిక్కెట్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కోచ్ లో రాత్రి లైట్లు మినహా అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలి.
⦿ ఎమ్మార్పీకి మించకూడదు
భారతీయ రైల్వే సంస్థ ఎమ్మార్పీ విషయంలో సీరియస్ గా ఉంటుంది. నిర్ణయించిన ధరకు మించి అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. రైల్లో గానీ, రైల్వే స్టేషన్ లో గానీ నిర్ణీత ధరకు మించి ప్యాకేజ్ ఫుడ్, వాటర్ అమ్మకూడదు. ఒకవేళ అలా అమ్మితే రైల్వే అధికారులు వారికి జరిమానా విధిస్తారు. అతడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.
⦿ రైల్లో పెద్ద శబ్దాలు చేయడం నేరం
రైళ్లలో పెద్ద శబ్దాలు చేయడం నిషేధం. ఫోన్, ఇతర గాడ్జెట్స్ వాడినా ఎక్కువ సౌండ్ పెట్టకూడదు.ఇరత ప్రయాణీకులు నిద్రపోతున్న సమయంలో వాయిస్ తగ్గించుకోవాలి. ఎక్కువ శబ్దం చేస్తూ మాట్లాడ్డం, మ్యూజిక్ వినడం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989లోని సెక్షన్ 145 (బి) ప్రకారం 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటురూ. 500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
Read Also:రైల్లో వాటర్ బాటిల్ అలా అమ్ముతున్నారా? వెంటనే ఇలా కంప్లైట్ చేయండి!